బాలీవుడ్ హీరోలు కొందరు గణేష్ చతుర్ధిని చాలా ఘనంగా జరుపుకుంటారు. అందులో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ముందుంటారు. ప్రతీ వినాయక చవితికి కూడా ఇంట్లో వాళ్లంతా పాల్గొని చాలా ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. ఈ సారి కరోనా సమయం ఉంది కాబట్టి పెద్దగా హడావిడి కనిపించడం లేదు. అయితే హృతిక్ రోషన్ ఇంట్లో ఈ సారి కూడా ఈ వేడుకలు ఆగలేదు. మొన్నే నిమజ్జనం చేసిన ఈ హీరో.. ఇప్పుడు ఇంట్లో గణేష్ పూజ నిర్వహించాడు.
తండ్రి రాకేష్ రోషన్.. భార్య సుజానే సహా అమ్మ, మిగిలిన వాళ్లు అంతా కలిసి గణేష్ పూజను నిర్వహించారు. భజన వీడియోను ప్రత్యేకంగా ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాడు హృతిక్ రోషన్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. గణేష్ చతుర్ధి వచ్చిందంటే చాలు తనకు చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయంటూ చెప్పుకొచ్చాడు హృతిక్. ఇప్పుడు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తున్నానని.. ఆ గణేష్ మహరాజ్ అందరికీ మంచి చేస్తాడని కోరుకున్నాడు హృతిక్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Ganesh Chaturthi 2020, Hindi Cinema, Hrithik Roshan