హోమ్ /వార్తలు /సినిమా /

Ganesh Chaturthi 2020 : విఘ్నాలు కలగకుండా చూడు వినాయక.. టాలీవుడ్ పూజలు..

Ganesh Chaturthi 2020 : విఘ్నాలు కలగకుండా చూడు వినాయక.. టాలీవుడ్ పూజలు..

టాలీవుడ్ వినాయక చవితి విషేస్ Photo : Twitter

టాలీవుడ్ వినాయక చవితి విషేస్ Photo : Twitter

Ganesh Chaturthi 2020: వినాయక చవితిని ప్రపంచ వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు హిందూవులు.

Ganesh Chaturthi 2020: వినాయక చవితిని ప్రపంచ వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు హిందూవులు. భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితిని వినాయక చవితి జరుపుకుంటారు. అయితే ఏ పూజ చేయాలన్నా తొలి పూజ మాత్రం దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడుకే చేస్తారు. సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు ఆయన. మనం చేసే మంచి పనులకు ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా ఉండేందుకు వినాయకుడిని పూజిస్తారు. చవితి రోజున ఆ గణనాథుడు, తన తల్లి పార్వతితో కలిసి కైలాసం నుంచి భూమికి వస్తాడట. ప్రజలు భక్తితో పెట్టే నైవేద్యాన్ని స్వీకరించి వారికి వరాలు కురిపిస్తాడని నమ్ముతారు భక్తులు. ఈ సందర్భంగా వినాయక చవితి రోజున భక్తులు ఆ ఏకదంతుడికి ప్రతిరూపంగా మట్టి గణేశ విగ్రహాల్ని ఇళ్లలో ప్రతిష్టించి పూజలూ చేస్తున్నారు.

ఇవాళ వినాయక చవితి కావడంతో ఉదయం నుంచే ప్రజలు పండగ చేసుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా ప్రజలు పూజలు మంటపాల్లో కాకుండా తమ ఇళ్లలోనే చేసుకుంటున్నారు. అందులో భాగంగా సినీ ప్రముఖులు కూడా వినాయకున్ని పూజిస్తూ.. తమ సినిమాలకు ఎటువంటి విఘ్నాలు రాకుండా చూడాలని ప్రార్ధిస్తున్నారు. కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు చేపట్టిన పనుల్లో విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

First published:

Tags: Ganesh Chaturthi 2020, Tollywood news

ఉత్తమ కథలు