చిరంజీవి సినిమా అంటే రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన సినిమా కోసం ఆరు నుంచి అరవై వరకు అంతా వేచి చూస్తుంటారు. కానీ థియేటర్స్‌లో మెగాస్టార్ మేనియా కనిపించినా కూడా టీవీల్లో మాత్రం కనిపించడం లేదు. ఆయన నటించిన సైరా సినిమా థియేటర్స్‌లో బాగానే వసూళ్ళు తీసుకొచ్చింది కానీ టీవీల్లో మాత్రం అంత మాయ చేయలేకపోయింది. సంక్రాంతి కానుకగా జెమిని టీవీలో సైరా నరసింహా రెడ్డి సినిమాను ప్రసారం చేసారు. చిరు సినిమా వచ్చిన సమయంలోనే వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ కూడా వచ్చింది. ఇది మా టీవీలో ప్రసారం చేసారు. సైరా కంటే రెండు రోజుల ముందు ఈ చిత్రాన్ని ప్లే చేసారు.
తొలిసారి టీవీలో వచ్చిన గద్దలకొండ గణేష్‌కు 12.83 రేటింగ్ వచ్చింది.. ఇక సైరాకు మాత్రం కేవలం 11.8 టీఆర్పీ మాత్రమే వచ్చింది. ఛానెల్స్ పరంగా స్టార్ మా, జెమినీ మధ్య రీచ్‌లో చాలా తేడాలున్నాయి. అయినా కూడా కారణం అది అయితే కాదు.. సైరా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రావడంతో అంతా చూసేసారు.. ఎక్కువగా ప్రేక్షకులకు రీచ్ కావడంతో టీవీలో వచ్చినా కూడా సైరాను పెద్దగా చూడలేదు ఆడియన్స్. మరోవైపు గద్దలకొండ గణేష్ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఈ సినిమా హాట్ స్టార్‌లో ఉన్నా కూడా పెద్దగా రీచ్ కాలేదు. దాంతో టీవీలో వచ్చినపుడు ఎక్కువగా చూసారు. ఏదేమైనా కూడా సైరాను బీట్ చేసి ఔరా అనిపించాడు వరుణ్ తేజ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gaddalakonda Ganesh Movie, Sye raa, Telugu Cinema, Tollywood