Home /News /movies /

GADDALAKONDA GANESH 1ST WEEK WORLDWIDE COLLECTIONS AND VARUN TEJ MOVIE EFFECTED BY RAINS PK

గద్దలకొండ గణేష్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. వరుణ్ తేజ్‌కు వరుణుడి దెబ్బ..

గద్దలకొండ గణేష్ కలెక్షన్స్ (Source: Twitter)

గద్దలకొండ గణేష్ కలెక్షన్స్ (Source: Twitter)

మాస్ సినిమాలకు టాక్‌తో పనిలేదు. ఎలా ఉన్నా కూడా కలెక్షన్లు మాత్రం వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా గద్దలకొండ గణేష్ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం..

మాస్ సినిమాలకు టాక్‌తో పనిలేదు. ఎలా ఉన్నా కూడా కలెక్షన్లు మాత్రం వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా గద్దలకొండ గణేష్ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం తొలిరోజే 6.7 కోట్ల షేర్ వసూలు చేసింది. మూడు రోజులు కూడా కలెక్షన్లు అలాగే వచ్చాయి. అయితే నాలుగో రోజు నుంచి వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దానికి కారణం సినిమాకు నెగిటివ్ టాక్ కాదు.. వర్షాలు రావడం. నాలుగో రోజు కూడా చాలా చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించాయి.
గద్దలకొండ గణేష్ కలెక్షన్స్ (Source: Twitter)

కానీ వర్షాలు కూడా జోరుగా పడటంతో చాలా ఏరియాల్లో వసూళ్లపై భారీ ప్రభావమే పడింది. వారం రోజుల్లో ఈ సినిమా 24 కోట్లకు పైగా వసూలు చేస్తుందనుకుంటే.. ఇప్పుడు 19.50 కోట్ల షేర్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కెరీర్‌లో తొలిసారి పవర్ ఫుల్ రోల్ చేసిన వరుణ్ తేజ‌కు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు.
గద్దలకొండ గణేష్ కలెక్షన్స్ (Source: Twitter)

వర్షాలు కానీ రాకుండా ఉండుంటే ఈ పాటికే అన్నిచోట్లా గద్దలకొండ గణేష్ సేఫ్ జోన్‌కి వచ్చి సంచలన విజయం సాధించి ఉండేది. అయినా కూడా రెండో వారం సినిమాలేవీ లేకపోవడంతో కచ్చితంగా వసూళ్ల వర్షం కురిపించడం ఖాయం అని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. 25 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన వరుణ్ తేజ్.. ఈ టార్గెట్ ఈజీగానే అందుకునేలా కనిపిస్తున్నాడు. మొత్తానికి మరో హిట్‌తో తన రేంజ్ మరింత పెంచుకున్నాడు మెగా ప్రిన్స్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Box Office Collections, Gaddalakonda Ganesh Movie, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు