Home /News /movies /

FROM POONAM PANDEY TO YOUTUBER PUNEET KAUR MANY WOMEN COME FORWARD AND MAKE SHOCKING ALLEGATIONS AGAINST SHILPA SHETTYS HUSBAND RAJ KUNDRA SRD

Raj Kundra : నగ్నంగా ఆడిషన్.. పోర్న్ మూవీస్ చేయమని టార్చర్..వెలుగులోకి శిల్ఫా శెట్టి భర్త లీలలు..

షెర్లిన్ చోప్రా - రాజ్ కుంద్రా - పునమ్ పాండే

షెర్లిన్ చోప్రా - రాజ్ కుంద్రా - పునమ్ పాండే

Raj Kundra : బాలీవుడ్ లో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కలకలం రేపుతోంది.. అరెస్ట్ తర్వాత రాజ్ కుంద్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అశ్లీల చిత్రాల నిర్మించి వాటిని వివిధ యాప్ లలో అప్ లోడ్ చేస్తున్నడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...
  బాలీవుడ్ లో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కలకలం రేపుతోంది.. అరెస్ట్ తర్వాత రాజ్ కుంద్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అశ్లీల చిత్రాల నిర్మించి వాటిని వివిధ యాప్ లలో అప్ లోడ్ చేస్తున్నడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పక్కా ఆధారాలతోనే రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇక రాజ్ కుంద్రా అశ్లీల రాకెట్ కేసులో సంచలన విషయాలు బయటకువస్తున్నాయి. బ్రిటన్ లోని తన బందువు ప్రదీప్ బక్షి తో కలిసి రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా బాలీవుడ్‌‌ నటి, మోడల్‌ సాగరికా సోనా సుమన్‌కు చెందిన ఓ పాత వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రాజ్‌ కుంద్రా మంచివాడు కాదంటూ.. అతన్ని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో సాగరిక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

  "నేను ఒక మోడల్‌ని. నటిగా రాణించాలనే ఉద్దేశంతో సుమారు నాలుగేళ్ల క్రితం పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఎక్కువ సినిమాల్లో నటించలేదు. లాక్‌డౌన్‌ సమయంలో నేను ఎదుర్కొన్న సమస్య మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. గతేడాది ఆగస్టులో ఉమేశ్‌ కామత్‌ నుంచి నాకో ఫోన్‌ కాల్‌ వచ్చింది. రాజ్‌కుంద్రా నిర్మిస్తున్న వెబ్‌సిరీస్‌లో నాకు అవకాశమిస్తున్నట్లు చెప్పారు. ఇంతకీ రాజ్‌ కుంద్రా ఎవరని నేను ప్రశ్నించాను. నటి శిల్పాశెట్టి భర్త అని ఉమేశ్‌ సమాధానమిచ్చారు"

  " ఒకవేళ నేను కనుక వెబ్‌సిరీస్‌లో నటిస్తే అవకాశాలు వరుస కడతాయని.. కెరీర్‌లో ఉన్నత స్థాయికి వెళ్తానని నమ్మించాడు. కెరీర్‌పై ఆశతో ఆ సిరీస్‌లో నటిస్తానన్నాను. వెంటనే ఆయన ఆడిషన్‌ చేయాలని సూచించారు. కొవిడ్‌ వల్ల ఆడిషన్‌కి రాలేనని సమాధానమిచ్చాను. వీడియో కాల్‌ ద్వారా ఆడిషన్‌ తీసుకుంటామని అన్నాడు. నేను దానికి అంగీకరించాను. అయితే, ఆయన చెప్పిన సమయానికి ఆడిషన్‌ కోసం వీడియో కాల్‌లో జాయిన్‌ కాగానే.. నగ్నంగా ఆడిషన్‌ ఇవ్వమని చెప్పారు. నేను షాకయ్యాను. అలాంటివి నేను చేయనని ఆ కాల్‌ నుంచి వైదొలిగాను. అయితే, నన్ను ఆడిషన్‌ చేసిన వారిలో ముగ్గురు వ్యక్తులున్నారు. అందులో ఒకరు ముఖానికి ముసుగు వేసుకున్నారు. నాకు తెలిసి ఆ వ్యక్తి రాజ్‌కుంద్రానే. అమ్మాయిల జీవితాలతో వ్యాపారం చేస్తున్న అలాంటి వ్యక్తుల్ని అరెస్ట్‌ చేయాలి" అని గతంలో సాగరిక ఆరోపించారు.

  అయితే రాజ్‌కుంద్రా అరెస్ట్ వెనకాల బాలీవుడ్‌ శృంగార తార షెర్లిన్‌ చోప్రా ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె ఇచ్చిన కంప్లయింట్ తోనే రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యాడు. తనను పోర్న్ మూవీస్ చేయాలని రాజ్ కుంద్రా బలవంత పెట్టేవాడని ఆమె గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు, వెబ్‌ సిరీస్‌ పేరుతో అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలపై కుంద్రాకి సంబంధించిన ఓ స్టార్టప్‌ కంపెనీ ఉద్యోగిని క్రైమ్‌ బ్రాండ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఉద్యోగికి ఏప్రిల్‌లో బెయిల్ మంజూరైంది.  మరోవైపు, రాజ్‌కుంద్రా అరెస్ట్‌పై బీటౌన్‌ నటి పూనమ్‌ పాండే హర్షం వ్యక్తం చేశారు. ఓ యాప్‌ లావాదేవీల విషయంలో రాజ్‌ తనని మోసం చేశాడని పేర్కొంటూ 2019లో పూనమ్‌ బాంబే హైకోర్టులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి న్యాయం కోసం ఎదురుచూస్తున్న పూనమ్‌ తాజాగా.. రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తనకి నమ్మకం ఉందని.. తప్పకుండా ఈసారి న్యాయం గెలిచితీరుతుందని ఆమె అన్నారు. " 2019లో నేనూ, రాజ్‌కుంద్రా కలిసి భాగస్వాములుగా ఓ యాప్‌ని ప్రారంభించాం. అయితే, రెవెన్యూ విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని గ్రహించిన నేను ఆ భాగస్వామ్యం నుంచి వైదొలగుతున్నట్లు మెయిల్‌ పంపించాను. దాంతో రాజ్‌, అతని బృందం.. నా పర్సనల్‌ ఫోన్‌ నంబర్‌, ఫొటోలను కొన్ని ప్రైవేట్‌ యాప్‌లలో ఉంచారు. ఎంతోమంది నుంచి అసభ్య సందేశాలు, వీడియోలు వచ్చేవి. వాటిని తట్టుకోలేక మూడు నెలలపాటు దేశం వదిలి వెళ్లిపోయాను" అని పూనమ్‌ తెలిపారు.

  అయితే గతంలో మహిళలను కించపరిచేలా పలు వివాదాస్పద ట్వీట్స్ చేసి వార్తల్లో నిలిచాడు రాజ్. అంతటితో ఆగకుండా సీతాదేవి ఉద్దేశించి కూడా ట్వీట్ చేశాడు. ఇవే కాదు గతంలోనూ రాజ్ కుంద్రా పై పలు ఆరోపణలు వచ్చాయి. ఐపీఎల్ ఫిక్సింగ్ లోను రాజ్ కుంద్రా హస్తం ఉందని వార్తలు వచ్చాయి. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాజ్ కుంద్రా సహ యజమానిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అలాగే 2018లో బిట్ కాయిన్ కుంబకోణాలోనూ రాజ్ కుంద్రా పై ఆరోపణలు వచ్చాయి. దాంతో అప్పట్లో ఈడీ ఆయనను విచారించింది. ఇప్పుడు అన్నింటికి సంబంధించిన పక్కా ఆధారాలు లభించడంతో అదుపులోకి తీసుకున్నట్టు హిందీ మీడియా సమాచారం.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Bollywood news, Poonam Pandey, Porn Movies, Shilpa Shetty

  తదుపరి వార్తలు