Pawan Kalyan - Venkatesh - Chiranjeevi: సీమ పిలుస్తుంది.. రాయలసీమ బాట పడుతున్న టాలీవుడ్..

రాయలసీమ కథలు (Rayalaseema stories)

Pawan Kalyan - Venkatesh - Chiranjeevi: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాయలసీమ కథలు ఎలా కలిసొచ్చాయో ప్రత్యేకంగా గుర్తు చేయాలా..? బాలయ్యతో పాటు మరికొందరు హీరోలు కూడా ఫ్యాక్షన్ సినిమాలు చేసి ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకున్నారు.

  • Share this:
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాయలసీమ కథలు ఎలా కలిసొచ్చాయో ప్రత్యేకంగా గుర్తు చేయాలా..? బాలయ్యతో పాటు మరికొందరు హీరోలు కూడా ఫ్యాక్షన్ సినిమాలు చేసి ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకున్నారు. ప్రతీ హీరోకు కూడా రాయలసీమ కథలు బాగానే కలిసొచ్చాయి. చిరంజీవి ఇంద్ర సినిమాతో రికార్డులు తిరగరాసాడు. బాలయ్య అయితే సీమ కథలకు ఆద్యుడు. సమరసింహారెడ్డి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తారుమారు చేసింది. ఫ్యాక్షన్ సినిమాలకు నాందీ ఈ చిత్రం. ఆ తర్వాత రెండేళ్ళకు నరసింహనాయుడు సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసాడు బాలయ్య. ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఆది, మహేష్ బాబు ఒక్కడు, వెంకటేష్ ప్రేమించుకుందాం రా సినిమాలతోనూ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. అలా రాయలసీమ కథలు మన హీరోలకు బాగానే కాసుల పంట పండించాయి. అయితే కొన్నేళ్లుగా సీమ కథలు తెలుగులో రావడం లేదు.

బోర్ కొట్టాయని వదిలేసారో.. ఫ్యాక్షన్ సినిమాలు చేసినా చూడరని పట్టించుకోవడం లేదో తెలియదు కానీ కొన్నేళ్లుగా సీమ కథలు రావడం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి రాయలసీమ వైపు అడుగులు వేస్తుంది టాలీవుడ్. మూడేళ్ళ కింద అరవింద సమేత పూర్తిగా సీమ నేపథ్యంలో వచ్చిన ఫ్యాక్షన్ సినిమా. త్రివిక్రమ్ తన మార్క్ చూపించి మంచి విజయమే అందుకున్నాడు.
venkatesh narappa rayalaseema story,pawan kalyan rana rayalaseema story,chiranjeevi lucifer remake rayalaseema story,balakrishna rayalaseema story,telugu cinema,jr ntr rayalaseema story,mahesh babu rayalaseema story,రాయలసీమ కథలతో టాలీవుడ్ హీరోలు,వెంకటేష్ నారప్ప రాయలసీమ కథ,చిరంజీవి లూసీఫర్ రీమేక్ సీమ కథ,పవన్ కళ్యాణ్ రానా మల్టీస్టారర్ సీమ కథ
పవన్ కళ్యాణ్ బ్యాక్ టూ వర్క్ (Twitter/Photo)

మొన్నటికి మొన్న విడుదలైన వెంకటేష్ నారప్ప కూడా పూర్తిగా అనంతపరం బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ. ఇప్పుడు సెట్స్‌పై ఉన్న పవన్ కళ్యాణ్, రానా అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్ రాయలసీమ నేపథ్యంలోనే వస్తుంది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తుంటే.. పవన్‌కు ప్రత్యేకంగా సీమ యాస నేర్పిస్తున్నాడు పెంచల్ దాస్.
venkatesh narappa rayalaseema story,pawan kalyan rana rayalaseema story,chiranjeevi lucifer remake rayalaseema story,balakrishna rayalaseema story,telugu cinema,jr ntr rayalaseema story,mahesh babu rayalaseema story,రాయలసీమ కథలతో టాలీవుడ్ హీరోలు,వెంకటేష్ నారప్ప రాయలసీమ కథ,చిరంజీవి లూసీఫర్ రీమేక్ సీమ కథ,పవన్ కళ్యాణ్ రానా మల్టీస్టారర్ సీమ కథ
వెంకటేష్ నారప్ప (Narappa)

ఇక చిరంజీవి లూసీఫర్ రీమేక్ సైతం సీమ నేపథ్యంలోనే రానుందని తెలుస్తుంది. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాకు ఇక్కడ రాయలసీమ రాజకీయాలను జోడిస్తున్నాడు దర్శకుడు మోహన్ రాజా. ఇవి మాత్రమే కాదు.. మరో రెండు మూడు భారీ సినిమాలను సైతం రాయలసీమ నేపథ్యంలోనే రాసుకుంటున్నారు దర్శకులు. మొత్తానికి మరోసారి సీమ గట్టిగానే టాలీవుడ్‌ను పిలుస్తుందన్నమాట.
Published by:Praveen Kumar Vadla
First published: