Home /News /movies /

FROM BUS CONDUCTOR TO DADASAHEB PHALKE AWARD RAJINIKANTH IS AN ACTOR A SPECIAL STORY SR

Rajinikanth: బస్ కండక్టర్ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరకు రజనీకాంత్ నట ప్రస్థానం..

Dadasaheb Phalke Award for Rajinikanth 
Photo :Twitter

Dadasaheb Phalke Award for Rajinikanth Photo :Twitter

Dadasaheb Phalke Award for Rajinikanth: సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డును రజనీకాంత్ అందుకున్నారు. రజనీకాంత్ గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు చేస్తోన్న సేవలు గుర్తించిన కేంద్రప్రభుత్వం.. ఆయన్ని ఈ పురస్కారంతో గౌరవించింది. అవార్డ్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేశారు.

ఇంకా చదవండి ...
  Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌ కేంద్ర ప్రభుత్వం 2019 యేడాదికి గాను సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులు మీదుగా అందుకున్నారు. రజనీకాంత్ గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు చేస్తోన్న సేవలు గుర్తించిన కేంద్రప్రభుత్వం.. ఆయన్ని ఈ పురస్కారంతో గౌరవించింది.  ఇక ఈ అవార్డులు  17వ జాతీయ చలన చిత్ర అవార్డుల సమయం నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. 1969లో ప్రారంభమైన ఈ అవార్డుల ప్రధానోత్సవం ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న 51వ వ్యక్తి రజనీకాంత్. రజనీకాంత్ మిగతా హీరోల్లా స్మార్ట్ గా ఉండడు. కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ అసలే లేదు. లేటెస్ట్ ట్రేండ్ అసలే ఫాలో కాడు. కానీ అందరు తనని ఫాలో అయ్యేట్టు చేస్తాడు.అంతేకాదు సినీ వినీలాకాశంలో స్వయంకృషితో ఎదిగిన నల్లని చంద్రుడు.

  అదరగొట్టే స్టైయిల్.. దిమ్మతిరిగే మ్యానరిజంతో బాక్సాఫీస్‌ను సింగిల్ హ్యాండ్‌తో శాసించగల వన్ అండ్ ఓన్లీ హీరో రజినీకాంత్. ఈ రోజు ఆయన  దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న సందర్భంగా న్యూస్18 స్పెషల్ స్టోరీ.

  Rajinikanth was given the Superstar title after the 1978 film Bairavi
  సూపర్ స్టార్ రజినీకాంత్ (Twitter/Photo)


  రజనీకాంత్ ఏం చేసినా సంచలనమే. నవ్వులో వైవిధ్యం, నడకలో వేగం, గొంతులో గాంభీర్యం, మ్యానరిజంలో మాస్ అప్పియరెన్స్ అన్నీ కలిసి ఆయన్ని సూపర్ స్టార్‌ని చేశాయి. రజినీకాంత్ సిగరెట్ వెలిగించినా, సెల్యూట్ చేసినా...కోట్ వేసినా.. అదొక స్టైల్..అదొక స్పెషల్ మ్యానరిజం. అందుకే మన దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అతి కొద్ది నటుల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు.

  గిరఫ్‌తార్‌లో రజినీకాంత్ (ఫేస్‌బుక్ ఫోటో)


  నేను ఒక్కసారి చెప్పితే వందసార్లు చెప్పినట్టే... దేవుడు శాసిస్తాడు ఈ అరుణచలం పాటిస్తాడు.... నా దారి రహదారి... నాన్నా పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది... లాంటి డైలాగ్స్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చాయి. ఈ డైలాగ్స్ పలకడంలో రజినీకాంత్ స్టైయిలే వేరు.

  శివాజీలో రజినీకాంత్ (ఫేస్‌బుక్ ఫోటో)


  తన సినిమాలతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే రజినీకాంత్..1950 డిసెంబర్ 12న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. మొదట బెంగుళూరు ట్రాన్స్ పోర్టులో కండక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. దాంతో పాటు అప్పుడప్పుడు స్టేజీల మీద నాటకాలు కూడా వేస్తుండేవాడు. అలా  దర్శక దిగ్గజం కే.బాలచందర్ దృష్టిలో పడ్డారు. ఆయన  దర్శకత్వంలో మొదటిసారి 1975లో తెరకెక్కిన ‘అపూర్వ రాగంగళ్’ సినిమాలో ప్రతినాయకుడిగా రజినీకాంత్ అదరగొట్టేసారు. ఆ తర్వాత రెండో చిత్రం ‘సంగమ’ కన్నడలో నటించారు. మూడో సినిమా ‘అంతులేని కథ’ తెలుగులో యాక్ట్ చేసిన సూపర్ స్టార్. తొలి మూడు చిత్రాలు మూడు భాషల్లో నటించిన యాక్టర్ బహుశా ఎవరు ఉండరేమో.

  కెరీర్ తొలినాళ్లలో రజినీకాంత్ (ఫేస్‌బుక్ ఫోటో)


  తెలుగులో వచ్చిన ‘చిలకమ్మ చెప్పింది’ సినిమాలో రజనీకాంత్ ఫస్ట్ టైం మెయిన్ రోల్ చేశాడు. రజనీలోని నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. సినీ ఇండస్ట్రీకి రజనీకాంత్ ను బహుమతిగా ఇచ్చింది కె.బాలచందర్. అయితే రజనీ మొదట్లో చేసిన రోల్స్ అన్నీ నెగెటివ్ లేదా సెకండ్ హీరో ఆఫ్షన్స్...అయితే ఆయన్ని పూర్తిస్థాయి పాజిటివ్ హీరోగా మార్చిన డైరెక్టర్ మాత్రం ఎస్.పి.ముత్తురామన్. ఈయన హీరో కార్తీక్ తండ్రి.

  రజినీకాంత్ (ఫేస్‌బుక్ ఫోటో)


  బాలచందర్ ‘అంతులేని కథ’ సినిమాలో హీరోగా కనిపించినా అది నెగెటివ్ షేడ్స్ ఉండే రోల్..ఫీమేల్ లీడ్ స్టోరీ...కానీ ముత్తురామన్ తీసిన ‘చిలకమ్మ చెప్పింది’ సినిమా రజనీ ఇమేజ్ నే మార్చేసింది. ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ పాజిటివ్ హీరో రోల్లో రజనీకాంత్ కెరీర్ ను టర్న్ చేసింది ఈ సినిమా.

  రజినీకాంత్ (ఫేస్‌బుక్ ఫోటో)


  1977లో తెలుగులో సింగిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చినా...తమిళ్‌లో సోలో హీరోగా అవకాశాలు రాలేదు.తెలుగు, తమిళ, కన్నడ, హిందీల్లో మంచి రోల్స్ వచ్చాయి. సెకండ్ హీరోగా చాలా సినిమాలు చేశాడు. అయితే 1980లో 25వ సినిమాగా చేసిన ‘భైరవి’ తమిళ్‌లో పుల్ లెంగ్త్ హీరో రోల్‌తో సోలో హీరోగా మారారు. ఈ సినిమా నుంచే రజినీకాంత్ పేరు ముందు సూపర్ స్టార్ బిరుదు వచ్చి చేరింది.  ఆ తరువాతే వరుస విజయాలతో సౌత్ ఇండియాలో సూపర్ స్టార్‌గా రజినీకాంత్ వెనుదిరిగి చూసుకోలేదు.

  డిఫరెంట్ మూవీస్‌లో రజినీకాంత్  (Facebook/Photo)


  ప్రేక్షకుల్లో రజినీకాంత్‌కు అంత క్రేజ్ రావడానికి కారణం ఆయన స్టైయిల్. ఆయన నటించిన సినిమాలు అంత పాపులార్ కావడానికి కారణం కూడా ఇదే. సిగరెట్ వెలిగించే స్టైల్... సెల్యూట్ చేసే స్టైయిల్‌ ఆయన్ని మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేశాయి. ఇక రజినీకాంత్ స్టైల్, మేనరిజమ్ పూర్తిస్థాయిలో ఆవిష్కరించిన చిత్రం ‘బాషా’. ఈ సినిమాలో ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే డైలాగ్స్ ఇప్పటికి ప్రేక్షకులు మరిచిపోలేదు.’బాషా’ మూవీతో రజినీకాంత్..తెలుగులో ఇక్కడి స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు.

  భాషాలో రజినీకాంత్(ఫేస్‌బుక్ ఫోటో)


  ఇక రజనీకాంత్ పేరుని ప్రపంచం మొత్తం పరిచయం చేసిన సినిమా ‘దళపతి’. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టితో కలిసి పనిచేశారు. తమిళ, కన్నడ, హిందీ, తెలుగులో ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, జగపతిబాబు వంటి అనేకమంది కథానాయకులతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు రజినీ. మరోవైపు హాలీవుడ్ సినిమాలో నటించిన ఘనత రజినీకాంత్ సొంతం.

  రజినీకాంత్ (ఫేస్‌బుక్ ఫోటో)


  తెలుగులో రజినీకాంత్ డైరెక్ట్‌గా నటించిన మరో సినిమా ‘పెదరాయుడు’. ఈ చిత్రంలో ఆయన కనిపించింది కాసేపే అయినా..ఆ రోల్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. రజినీకాంత్ చేసిన పాపారాయుడు పాత్ర  ఈ సినిమా విజయంలో కీలకంగా మారింది.

  పెదరాయుడులో పాపారాయుడుగా రజినీకాంత్ (ఫేస్‌బుక్ ఫోటో)


  ఆ తరువాత వచ్చిన ‘ముత్తు’ సినిమా కూడా రజినీకి పెద్ద హిట్.  సూపర్ స్టార్ ఖ్యాతిని జపాన్ వరకు తీసుకెళ్లిన సినిమా ‘ముత్తు’. ఈ సినిమా హిట్ తో విదేశాల్లో రజినీ పేరు ఖండాంతరాలు దాటింది.

  ముత్తు జపాన్ వెర్షన్ (ఫేస్‌బుక్ ఫోటో)


  ఆ తర్వాత ‘అరుణాచలం’, నరసింహా’, ‘చంద్రముఖి’, ‘శివాజీ’ మూవీలు రజినీకాంత్ ఇమేజ్‌ను పెంచాయి. శంకర్ ,రజినీ కాంబీనేషన్‌లో వచ్చిన రెండో అద్బుత సైంటిఫిక్ మూవీ ‘రోబో’. కోలీవుడ్, బాలీవుడ్‌లతో పాటు టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది.

  నరసింహాలో రజినీకాంత్ (ఫేస్‌బుక్ ఫోటో)


  రోబో తర్వాత రజినీకాంత్ నటించిన ‘కొచ్చాడయాన్’, ‘లింగ’, ‘కబాలి’, ‘కాలా’  2.O‘పేట’, దర్బార్’ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక ఆయన ప్రస్తుతం అన్నాత్తే అనే సినిమాతో వస్తున్నారు. ఈ సినిమా దీపావళికి విడుదలవుతోంది.

  kaala satellite goes for huge price, dhanush is very happy
  ‘కాలా’ పోస్టర్


  రజినీకాంత్ సినీకెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. తమిళ్‌లో ఆరు సార్లు ఉత్తమ నటుడి అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, కేంద్రం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. తాజాగా భారతీయ సినీ రంగంలో అత్యున్నత అవార్డు అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఇక  రజినీకాంత్‌లో  ఆధ్మాత్మిక భావాలు కూడా ఎక్కువ. ఖాళీ సమయాల్లో హిమాలయాకు వెళుతూ సేద తీరుతూ ఉంటారు.

  రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ (ఫేస్‌బుక్ ఫోటో)


  అంతేకాదు  పూర్తిస్థాయి రాజకీయాల్లో ప్రవేశించి ఆరోగ్యం సహకరించకపోవడంతో పాలిటిక్స్‌ విషయంలో యూటర్న్ తీసుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి రీల్ లైఫ్‌లోనే కాదు..రియల్ లైఫ్‌లో నిజమైన హీరోగా ఎదిగిన రజినీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం .. ఆ అవార్డుకే దక్కిన గౌరవంగా అందరు భావిస్తున్నారు. ఈయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Rajinikanth, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు