HOME »NEWS »MOVIE »from ala vaikuntapurramuloo butta bomma to vakeel saab maguva maguva these are the tollywood top songs in 2020 pk

Tollywood top songs 2020: 2020లో మైమరిపించిన టాలీవుడ్ టాప్ 14 సాంగ్స్ ఇవే..

Tollywood top songs 2020: 2020లో మైమరిపించిన టాలీవుడ్ టాప్ 14 సాంగ్స్ ఇవే..
టాలీవుడ్ టాప్ సాంగ్స్ 2020

Tollywood top songs 2020: మనసుకు ఏదైనా కష్టం అనిపిస్తే చాలు చక్కటి సంగీతాన్ని విన్నపుడు హాయిగా అనిపిస్తుంది. మనసులో ఉన్న వెలితిని పోగొట్టడానికి మంచి పాటలు చాలా హెల్ప్ అవుతుంటాయి. అలాంటి మంచి పాటలు విన్నపుడు మనకు తెలియకుండానే ఎటో వెళ్లిపోతుంటాం. అలాంటి అద్భుతమైన సంగీతం తెలుగులో కూడా ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు మన సంగీత దర్శకులు. అలా 2020లో మన ప్రేక్షకుల మనసు దోచిన కొన్ని పాటలను ఇప్పుడు చూద్దాం..

  • Share this:
మనసుకు ఏదైనా కష్టం అనిపిస్తే చాలు చక్కటి సంగీతాన్ని విన్నపుడు హాయిగా అనిపిస్తుంది. మనసులో ఉన్న వెలితిని పోగొట్టడానికి మంచి పాటలు చాలా హెల్ప్ అవుతుంటాయి. అలాంటి మంచి పాటలు విన్నపుడు మనకు తెలియకుండానే ఎటో వెళ్లిపోతుంటాం. అలాంటి అద్భుతమైన సంగీతం తెలుగులో కూడా ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు మన సంగీత దర్శకులు. అలా 2020లో మన ప్రేక్షకుల మనసు దోచిన కొన్ని పాటలను ఇప్పుడు చూద్దాం.. అందులో చాలా పాటలున్నాయి. అల్లు అర్జున్ అగ్రస్థానంలో ఉంటే పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, ప్రదీప్ లాంటి హీరోల పాటలు కూడా ఇందులో ఉన్నాయి.

1. బుట్ట బొమ్మ: అల వైకుంఠపురములోఅల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఇందులో అన్నిపాటలు దుమ్ము లేపాయి. ముఖ్యంగా తమన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది అల వైకుంఠపురములో ఆల్బమ్. ఈ సినిమా తర్వాత థమన్ రేంజ్ మారిపోయింది. ఇక ఇందులోని సామజవరగమనా, రాములో రాములా పాటలు సంచలనాలు సృష్టించాయి. అయితే సైలెంట్‌గా మొదలై ఇప్పటికీ రికార్డులు తిరగరాస్తున్న పాట మాత్రం బుట్ట బొమ్మ. ఇప్పటికే 400 మిలియన్ వ్యూస్ దాటేసి.. 500 వైపు పరుగులు తీస్తుంది బుట్టబొమ్మ. ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడాడు.

2. నీలీ నీలీ ఆకాశం: 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?

యాంకర్ ప్రదీప్ హీరోగా మారిన సినిమా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? ఈ సినిమా వస్తున్నట్లు కూడా చాలా మందికి ముందు తెలియదు. కానీ ఒక్క పాటతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నీలినీలి ఆకాశం అంటూ అమృత అయ్యర్‌తో కలిసి ప్రదీప్ పాడుకున్న పాట రికార్డులు తిరగరాసింది. విడుదలకు ముందే 200 మిలియన్స్ దాటిన తొలిపాట ఇదే. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటను సిధ్ శ్రీరామ్, సునీత పాడారు.

3. నీ కన్ను నీలి సముద్రం: ఉప్పెన

2020లో దేవీ శ్రీ ప్రసాద్ కాస్త వెనకబడిపోతున్నాడు అనుకుంటున్న సమయంలో ఈయన నుంచి వచ్చిన అద్భుతమైన గీతం ‘నీ కన్ను నీలి సముద్రం’. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమాలోని ఈ కవాలి తరహాలో సాగే పాట అదిరిపోయింది. యూ ట్యూబ్‌లో ఈ పాటకు ఇప్పటికే 150 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. జావేద్ అలీ పాడిన ఈ పాటను శ్రీమణి, రఖీబ్ ఆలమ్ సాహిత్యం అందించారు.

4. సామజవరగమనా: అల వైకుంఠపురములో

2020లో వచ్చిన బెస్ట్ మ్యూజికల్ ఆల్బమ్ ఏదైనా ఉందా అంటే అది మరో సందేహం లేకుండా అల వైకుంఠపురములో. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అందులో మరీ ముఖ్యంగా బుట్ట బొమ్మ తర్వాత సామాజవరగమనా.. చరిత్ర తిరగరాసింది. సిధ్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు అంతా ఫిదా అయిపోయారు. నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు అంటూ టిక్‌టాక్‌లో కూడా రప్ఫాడించింది ఈ పాట.

5. వాటే బ్యూటీ: భీష్మ

అ..ఆ సినిమా తర్వాత సరైన విజయం లేని నితిన్ ఈ ఏడాది భీష్మతో మంచి హిట్ అందుకున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలోని వాటే బ్యూటీ పాట బాగానే పాపులర్ అయింది. ముఖ్యంగా డాన్సులు కూడా కుమ్మేసాడు నితిన్. రష్మిక అయితే మరో రేంజ్‌లో తనలోని డాన్సులు చూపించింది. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.

6. నక్కలీసు గొలుసు: పలాస 1978

కొన్ని సినిమాలు వచ్చినపుడు ఎవరికీ తెలియవు. కేవలం పాటల కారణంగానే పాపులర్ అవుతుంటాయి. అలాంటి సినిమా పలాస 1978. రాజమౌళి శిష్యుడు కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. ఈ చిత్రానికి రఘు కుంచె స్వరాలు అందించాడు. అందులో నాది నక్కిలీసు గోలుసు పాట అయితే చరిత్ర తిరగరాసింది. ఈ పాటకు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పటికీ కూడా ఎక్కడ విన్నా ఇదే పాట వినిపిస్తుంది.

7. లైఫ్ ఆఫ్ రామ్: జాను

తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా జాను. 96 తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంలో శర్వానంద్, సమంత అక్కినేని జంటగా నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించలేదు. కానీ ఈ చిత్రంలో లైఫ్ ఆఫ్ రామ్ పాట మాత్రం బాగా ఆకట్టుకుంది. గోవింద్ వసంత ఈ సినిమాకు సంగీతం అందించాడు.

8. ఉండిపోవా నువ్విలా: సవారి

గీతామాధురి భర్త నందు హీరోగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో వచ్చిన సినిమా సవారి. ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్‌గా నటించింది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రంలోని రెండు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. నా కన్నులు అంటూ రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటతో పాటు ఉండిపోవా నువ్విలా అనే పాట కూడా బాగా హిట్ అయింది. 2020లో ఆకట్టుకున్న పాటల లిస్టులో ఇవి కూడా ఉన్నాయి.

9. సోలో బ్రతుకే సో బెటర్: నో పెళ్లి దాన్ తల్లి

సాయి ధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సోలో బ్రతుకే సో బెటర్. ఈ చిత్రంలోని హే ఇది నేనేనా అంటూ సిధ్ శ్రీరామ్ పాడిన పాట బాగానే పాపులర్ అయింది. అయితే దానికంటే కూడా నో పెళ్లి దాన్ తల్లి పాట మాత్రం దుమ్ము దులిపేసింది. పెళ్లి వద్దురా బాబూ అంటూ చెప్పిన పాటకు యూత్ బాగానే ఫిదా అయిపోయారు. 2020 టాప్ లిస్టులో ఈ పాట కూడా ఉంది.

10. ఆకాశం నీ హద్దురా: కాటుక కనులే

డబ్బింగ్ పాటలకు ఆదరణ దక్కడం అరుదుగా జరుగుతుంటుంది. కానీ సూర్య హీరోగా వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమాలోని ఓ పాట మాత్రం ఇప్పుడు మార్మోగిపోతుంది. కాటుక కనులే కరిగిపోయే పిలడా నిను చూసి అంటూ సాగే పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట తెలుగులో కూడా దుమ్ము దులిపేసింది. ఇప్పటికే మిలియన్స్ కొద్ది వ్యూస్ అందుకుంది ఈ పాట.

11. రాహు: ఏమో ఏమో ఏమో

కొత్త దర్శకుడు సుబ్బు వేదుల దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ రాహు. ఇందులో అభిరామ్ వర్మ, కృతి గార్గ్ నటించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించాడు. ఇందులో ఏమో ఏమో ఏమో.. అంటూ సిద్ శ్రీరామ్ పాడిన పాట బాగానే హిట్ అయింది. యూ ట్యూబ్‌లో ఈ పాటకు 42 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

12. వకీల్ సాబ్: మగువ మగువ

పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాలోని మగువా మగువా.. నీ సహనానికి సరిహద్దులు కనవా అంటూ సాగే అద్భుతమైన పాట చాలా రోజుల పాటు యూ ట్యూబ్‌లో ట్రెండ్ అయింది. థమన్ స్వరపరిచిన ఈ పాటను ఇప్పటి వరకూ 38 మిలియన్ల మంది చూసారు. 2020 టాప్ సాంగ్స్‌లో కూడా ఇది కూడా ఉంది.

13. శ్రీకారం: భలేగుంది బాల

లేట్‌గా వచ్చినా లేటెస్టుగా టాప్ సాంగ్స్ లిస్టులో ఎంట్రీ ఇచ్చిన పాట భలేగుంది బాల. శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమాలోని భలేగుంది బాలా.. పాట యూ ట్యూబ్‌‌లో దుమ్ము దులిపేస్తుంది. ఈ పాటకు ఇప్పటికే 15 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. కిశోర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు.. మిక్కి జె.మేయర్ సంగీతం ఇచ్చారు. అయితే ఈ ఒక్క పాటను మాత్రం పెంచల్ దాస్ రచించి, సంగీతం అందించాడు.

14. సరిలేరు నీకెవ్వరు :మైండ్ బ్లాక్

ఈ పాటలతో పాటు సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మైండ్ బ్లాక్.. శేఖర్‌ కమ్ముల 'లవ్‌ స్టోరీ' చిత్రంలోని ఏ పిల్లా.. నాని సుధీర్ బాబు వి సినిమాలోని 'మనసు మరీ మత్తుగా..' అల వైకుంఠపురములో చిత్రంలోని 'సిత్తరాల సిరపడు'తో పాటు మరికొన్ని పాటలు కూడా ఈ ఏడాది అద్భుతాలు చేసాయి. కలర్ ఫోటో సినిమాలోని తరగతి గది పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
Published by:Praveen Kumar Vadla
First published:December 26, 2020, 14:59 IST