news18-telugu
Updated: September 1, 2019, 4:11 PM IST
ప్రభాస్ సాహో చిత్రంపై ఫ్రెంచ్ దర్శకుడు ఘాటు వ్యాఖ్యలు
ఒకప్పుడు ఏ దర్శకుడు ఏ ఇంగ్లీష్ సినిమా నుండి కాపీ చేసి ఆ సీన్ లేపేసినా..సామాన్య ప్రేక్షకులకు అంతగా తెలిసేది కాదు. ఇలా ఎన్నో తెలుగు సినిమాల్లోని సీన్లను ఇంగ్లీష్ సినిమాల నుండి దర్శకుడు లేపేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. సామాన్యంగా ఇవి ప్రేక్షకులకు అంతగా తెలిసేది కాదు. టెక్నాలజీ పుణ్యామా అంటూ గ్లోబల్ మొత్తం ఒక విలేజ్‌గా మారింది. దీంతో ఎవరు ఏ సినిమాలో సీను కాపీ చేసినా క్షణాల్లో ప్రజలకు తెలిసిపోతుంది. తాజాగా ‘సాహో’చిత్రం పై ప్రముఖ ఫ్రెంచ్ చిత్రం ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోమ్ సల్లో మాట్లాడుతూ.. తాజాగా ‘సాహో’చిత్రంపై కాస్తంత ఘాటుగానే ట్విట్టర్లో స్పందించారు.
అదేదో సినిమాలో త్రివిక్రమ్ చెప్పినట్టు.. ఏదైన సినిమాను కాపీ చేసేటపుడు కాస్తంత శ్రద్దగా కాపీ చేస్తే సరిపోతుంది. మీరు మాత్రం నా సినిమాను ముందు ‘అజ్ఞాతవాసి’గా రీమేక్ చేసి చెడగొట్టారు. అది చాలదన్నట్టు ఇపుడు నా సినిమాను ప్రేరణగా తీసుకొని తీసిన ‘సాహో’ సినిమాను చూసాను. ఈ సినిమా ‘అజ్ఞాతవాసి’కంటే వరస్ట్ అంటూ కామెంట్ పెట్టాడు. కాపీ సీన్స్‌ను తెరకెక్కించేటపుడు కాస్తంత చూసుకొని తెరకెక్కిస్తే బాగుంటుంది. వీళ్లకు దొంగతనం కూడా చాతకాలేదు అంటూ కామెంట్స్ చేయడం ఇపుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై సాహో టీమ్ ఏం స్పందిస్తుందో చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
September 1, 2019, 4:10 PM IST