Home /News /movies /

Chiranjeevi : చిరంజీవి నట ప్రయాణానికి నలబై మూడు సంవత్సరాలు.. భావోద్వేగం చెందిన మెగాస్టార్..

Chiranjeevi : చిరంజీవి నట ప్రయాణానికి నలబై మూడు సంవత్సరాలు.. భావోద్వేగం చెందిన మెగాస్టార్..

చిరంజీవి (Twitter/Photo)

చిరంజీవి (Twitter/Photo)

మెగాస్టార్ చిరంజీవ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి గురైయారు. ఆయన ట్విట్టర్ వేదికగా రాస్తూ.. ఈరోజు మ‌రిచిపోలేని రోజు అంటూ ట్వీట్ చేశారు.

  మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  సోషల్ మీడియా వేదికగా కొంత భావోద్వేగానికి గురైయారు. ఆయన ట్విట్టర్ అకౌంట్‌లో రాస్తూ.. ఈ రోజు తాను మ‌రిచిపోలేని రోజు అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. న‌టుడిగా తాను అప్ప‌ట్లో ఇదే రోజున సినీ ప‌రిశ్ర‌మ‌లో తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాన‌ని ఆయ‌న వివ‌రించారు. 'ఆగ‌స్టు 22 నేను పుట్టినరోజైతే సెప్టెంబ‌రు 22 నటుడిగా నేను పుట్టినరోజు. కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికి నన్ను నటుడిగా పరిచయంచేసి మీ ఆశీస్సులు పొందినరోజు. నేను మరిచిపోలేని రోజు' అని చిరంజీవి భావోద్వేగం చెందారు. చిరంజీవి న‌టించిన తొలి సినిమా 'పునాది రాళ్లు'.  అయితే పునాది రాళ్లు కంటే ముందు చిరంజీవి 'ప్రాణం ఖ‌రీదు' సినిమా విడుద‌లైంది. 1978, సెప్టెంబర్ 22న ఆ సినిమా విడుద‌లైన త‌ర్వాత చిరంజీవి వ‌రుస‌గా సినిమాల్లో న‌టించారు. మెగాస్టార్‌గా ఎదిగారు.

  ఆచార్య విషయానికి వస్తే..

  ఇక ఆయన నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య విషయానికి వస్తే.. ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తన 152వ చిత్రాన్ని చేస్తున్నారు.


  ఆచార్య ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుందని టాక్. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ ఓ మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట. ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట.

  Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్ కేసులో ఈడీ ముందుకు తరుణ్.. మొదలైన విచారణ...

  ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

  ఊటీలో గాడ్ ఫాదర్ షూటింగ్ మొదలు..

  ఈ సినిమాతో పాటు చిరంజీవి (Chiranjeevi) హీరోగా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌లో గాడ్ ఫాదర్ అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ (Lucifer) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God Father) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.  ఈరోజు ఈ సినిమా ఊటీలో షూటింగ్ చేయనుంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మాతృకలో వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) పోషించిన బాబీ పాత్రలో బిజు మీనన్ బాబీ నటించనున్నారట.

  Sai Dharam Tej | Republic Trailer : అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది.. అదిరిన రిపబ్లిక్ ట్రైలర్..

  ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక హిందీ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ మెగాస్టార్ కి సిస్టర్ గా నటించబోతుందని తెలుస్తోంది. దీనిపై కూడా అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది. విద్యా బాలన్ తెలుగులో ఇప్పటికే  బాలయ్య హీరోగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించిన సంగతి తెలిసిందే.

  మరో కీలకపాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. మోహన్ రాజా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను యాడ్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. పైగా హీరోయిన్ గా నయనతారను ఫైనల్ చేశారట. సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు ఓ వార్త ఇటీవల హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

  ఈ రెండు సినిమాలతో పాటు చిరంజీవ భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నారు. మెహెర్ రమేష్ దర్శకుడు. ఈ సినిమా తమిళ వేదాళంకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ కీలకపాత్రలో కనిపించనుంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Chiranjeevi, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు