సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనక దావూద్ గ్యాంగ్ హస్తం..?

Sushant SIngh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి సరిగ్గా నెల రోజులు అవుతుంది. అయినా కూడా ఈయన మరణంపై ఇంకా అనుమానాలు మాత్రం ఆగడం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 13, 2020, 6:10 PM IST
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనక దావూద్ గ్యాంగ్ హస్తం..?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput/twitter)
  • Share this:
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి సరిగ్గా నెల రోజులు అవుతుంది. అయినా కూడా ఈయన మరణంపై ఇంకా అనుమానాలు మాత్రం ఆగడం లేదు. అసలు ఈయన ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే హత్య చేసారా అంటూ అనుమానాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. అభిమానులు అయితే సోషల్ మీడియాలో రోజుకో రకంగా సాక్ష్యాలు పెడుతున్నారు. అసలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదంటూ వాళ్లు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈయన సూసైడ్ చేసుకున్నాడంటూ తేల్చేసారు.. పోస్టుమార్టం రిపోర్టులు కూడా ఇవే చెప్తున్నాయి.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput/twitter)
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput/twitter)


ఇదిలా ఉంటే ఇండియన్ మాజీ రా ఆఫీసర్ ఎన్‌.కె. సూద్ వాదన మరోలా ఉంది. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సుశాంత్‌ను హత్య చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. ఇది విన్న తర్వాత ఒక్కసారిగా అంతా షాక్ అవుతున్నారు. సుశాంత్ మరణం వెనక బాలీవుడ్ పెద్దలతో పాటు ఆయన సన్నిహితులు, అలాగే డి గ్యాంగ్ కూడా ఉన్నారని ఆరోపిస్తున్నాడు సూద్. సుశాంత్‌ సింగ్‌ను ఫోన్‌లో దావూద్ గ్యాంగ్ బెదిరించిందని ఆయన తెలిపాడు.
దావుద్ ఇబ్రహీం (Dawood Ibrahim)
దావుద్ ఇబ్రహీం (Dawood Ibrahim)

అందుకే నెల రోజుల్లోనే సుశాంత్ 50 సిమ్ కార్డులు మార్చేసాడని సూద్ చెప్పాడు. కానీ చెప్తున్న దానికి మాత్రం ఒక్క ఆధారం కూడా చూపించడం లేదు మాజీ రా ఆఫీసర్. కానీ డీ గ్యాంగ్ బెదిరింపుల వల్లే సుశాంత్ మానసిక రుగ్మతకు గురయ్యాడనేది ఈయన వాదన. పక్కా ప్రణాళిక ప్రకారమే సుశాంత్‌ను అంతా కలిసి చంపేసారని ఆరోపిస్తున్నాడు సూద్. లేకపోతే ఆయన చనిపోయే ముందు రోజే ఎలా సీసీ కెమెరాలు ఆగిపోతాయని ప్రశ్నిస్తున్నాడు ఈయన.

దావూద్ గ్యాంగ్ బెదిరింపుల నుంచి తప్పించుకోడానికి సుశాంత్ కనీసం ఇంటికి వచ్చేవాడు కాదని.. కార్‌లోనే పడుకుండిపోయేవాడని సంచలన నిజాలు బయటపెట్టాడు సూద్. అయితే వీటికి ఆధారాలు ఎక్కడ అంటే మాత్రం ఆయనేం మాట్లాడటం లేదు. సుశాంత్ మరణం వెనక ఆయన మేనేజర్ హస్తం కూడా ఉందని చెప్పాడు ఈ రా ఆఫీసర్. మరి ఈయన చెప్పిన దాంట్లోనే నిజంగానే నిజాలు ఉన్నాయా లేదంటే ఆయన అలా అన్నాడా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
Published by: Praveen Kumar Vadla
First published: July 13, 2020, 6:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading