నిఖిల్ పెళ్లి మరికొన్ని గంటల్లోనే.. కరోనాకు బెదిరేది లేదు..

Nikhil Gowda marriage: అదేంటి.. ఇప్పుడు పెళ్లిళ్లు పేరంటాలు చేసుకోవద్దని చెప్పారు కదా.. అయినా మళ్లీ పెళ్లేంటి.. పైగా నిఖిల్ తన పెళ్లికి వాయిదా కూడా వేసుకున్నాడు కదా అనుకుంటున్నారా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 16, 2020, 3:17 PM IST
నిఖిల్ పెళ్లి మరికొన్ని గంటల్లోనే.. కరోనాకు బెదిరేది లేదు..
ఏప్రిల్ 17న నిఖిల్ పెళ్లి (Nikhil Gowda Revathi Marraige)
  • Share this:
అదేంటి.. ఇప్పుడు పెళ్లిళ్లు పేరంటాలు చేసుకోవద్దని చెప్పారు కదా.. అయినా మళ్లీ పెళ్లేంటి.. పైగా నిఖిల్ తన పెళ్లికి వాయిదా కూడా వేసుకున్నాడు కదా అనుకుంటున్నారా..? అయితే ఇక్కడ నిఖిల్ అంటే మన నిఖిల్ కాదు.. కన్నడ హీరో నిఖిల్ గౌడ.. ఈయన గుర్తున్నాడా.. అప్పట్లో ఓ సారి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించిన కథతో జాగ్వార్ సినిమా చేశాడు. ఈయనకు చాలా పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంది. ఈయన తాత మాజీ ప్రధాని దేవెగౌడ.. తండ్రి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి. అంత బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టే స్టార్ హీరోలు కూడా కుళ్లుకునేలా ఎంట్రీ ఇచ్చాడు.

నిఖిల్ గౌడ రేవతి నిశ్చితార్థం (nikhil gowda revathi engagement)
నిఖిల్ గౌడ రేవతి నిశ్చితార్థం (nikhil gowda revathi engagement)


సినిమాల విషయం పక్కన బెడితే ప్రస్తుతం ఈయన పెళ్లి మూడ్‌లో ఉన్నాడు. ఏప్రిల్ 17న నిఖిల్ కుమార్ గౌడ ఏడడుగులు వేయనున్నాడు. జనవరిలో కర్ణాటక మాజీ మంత్రి కృష్ణప్ప మేనల్లుడి కుమార్తె రేవతితో నిఖిల్ నిశ్చితార్థం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక కర్ణాటకలో సంచలనం అయింది. పెళ్లి కూడా అలాగే చేయాలని రెండు నెలల క్రితమే ఏర్పాట్లు మొదలుపెట్టారు. కానీ అంతలోనే ఇదిగో కరోనా వచ్చింది.

నిఖిల్ గౌడ రేవతి నిశ్చితార్థం (nikhil gowda revathi engagement)
నిఖిల్ గౌడ రేవతి నిశ్చితార్థం (nikhil gowda revathi engagement)


అయినా కూడా పెళ్లి వాయిదా వేయడానికి ఇష్టపడలేదు నిఖిల్ కుటుంబ సభ్యులు. అందుకే కర్ణాటకలోని రమణగారలోని తమ ఫామ్‌హౌస్‌లో నిఖిల్ పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇరు కుటుంబాలతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు. అందర్నీ పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాతే లోపలికి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో నితిన్, నిఖిల్ ఇప్పటికే తమ పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: April 16, 2020, 3:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading