• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • FORMER MISS INDIA UNIVERSE SIMRAN KAUR MUNDI TO ACT IN PRABHAS RADHE SHYAM MOVIE MNJ

Prabhas Radhe Shayam: ప్ర‌భాస్ సినిమాలో మాజీ మిస్ ఇండియా యూనివ‌ర్స్.. ఎనిమిదేళ్ల త‌రువాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ

ప్రభాస్

Prabhas- Simran kaur Mundi: రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌స్తే ఎవ్వ‌రూ అంత ఈజీగా వ‌దులుకోరు. ఇప్పుడు అదే అవ‌కాశం ఒక హీరోయిన్‌కు వ‌చ్చింది. ప్ర‌భాస్ సినిమా అని తెలిసి ఒక్క నిమిషం కూడా ఆలోచించ‌కుండా ఓకే చెప్పేసింది. అంతేకాదు ఈ అవ‌కాశం వ‌చ్చినందుకు త‌నకు ఎంతో సంతోషంగా ఉంద‌ని మేఘాల్లో తేలిపోతుంది ఆ బ్యూటీ

  • Share this:
    Prabhas- Simran kaur Mundi: రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌స్తే ఎవ్వ‌రూ అంత ఈజీగా వ‌దులుకోరు. ఇప్పుడు అదే అవ‌కాశం ఒక హీరోయిన్‌కు వ‌చ్చింది. ప్ర‌భాస్ సినిమా అని తెలిసి ఒక్క నిమిషం కూడా ఆలోచించ‌కుండా ఓకే చెప్పేసింది. అంతేకాదు ఈ అవ‌కాశం వ‌చ్చినందుకు త‌నకు ఎంతో సంతోషంగా ఉంద‌ని మేఘాల్లో తేలిపోతుంది ఆ బ్యూటీ. ఇంత‌కు ఆ హీరోయిన్ ఎవ‌రు అంటే. ఆ బ్యూటీకి ఏ సినిమాలో ఆఫ‌ర్ వ‌చ్చింది అన్న వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధే శ్యామ్‌లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోంది. కృష్ణం రాజు భాగ్య‌‌శ్రీ, స‌చిన్ కేడ్క‌ర్, ప్రియ‌ద‌ర్శి, ముర‌ళీశ‌ర్మ‌, శాషా ఛ‌త్రీ, కునాల్‌ రాయ్ క‌పూర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 70శాతానికి పైగా పూర్తి అయ్యింది. కాగా ఈ మూవీలో తాజాగా భాగం అయ్యారు మాజీ మిస్ ఇండియా యూనివ‌ర్స్ సిమ్రాన్ కౌర్ ముండి. ఈ విష‌యాన్ని ఆమె అధికారికంగా ప్ర‌క‌టించారు.

    ఇటీవ‌ల ఓ మీడియా ఇంట‌ర్య్యూలో పాల్గొన్న సిమ్రాన్.. రాధే శ్యామ్ యూనిట్ నుంచి త‌న కోసం కాల్ వ‌చ్చింద‌ని కాస్టింగ్ ఏజెంట్ చెప్పిన వెంట‌నే నేను ఒప్పుకున్నాను. ఒక్క నిమిషం కూడా నేను ఆలోచించ‌లేదు అని అన్నారు. ఇప్పుడు నా పాత్రను గురించి నేను రివీల్ చేయ‌లేను. కానీ చాలా ముఖ్య పాత్ర‌ను పోషిస్తున్నాను. దాన్ని మీరు తెర‌పైన చూడాలి. ఈ ఆఫ‌ర్ వ‌చ్చినందుకు నా సంతోషాన్ని నేను చెప్ప‌లేను. రాధే శ్యామ్ టీమ్‌తో ప‌ని చేసేందుకు ఎదురుచూస్తున్నా అని అన్నారు.

    కాగా మోడ‌ల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన సిమ్రాన్‌.. 2008లో మిస్ ఇండియా యూనివ‌ర్స్ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ బ్యూటీ హిందీలో జో హుమ్ చాహేన్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనూ మంచు మ‌నోజ్ న‌టించిన పోటుగాడు చిత్రంలో సిమ్రాన్ నటించింది. ఇప్పుడు ఎనిమిదేళ్ల త‌రువాత ఆమె తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది.
    Published by:Manjula S
    First published: