మోహన్ లాల్‌కు షాక్ ఇచ్చిన కోర్ట్.. నిందితుడిగా తేల్చిన న్యాయస్థానం..

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా ఈయన నటించాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 20, 2019, 9:27 PM IST
మోహన్ లాల్‌కు షాక్ ఇచ్చిన కోర్ట్.. నిందితుడిగా తేల్చిన న్యాయస్థానం..
మోహన్ లాల్ ఫైల్ ఫోటో
  • Share this:
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా ఈయన నటించాడు. ఇక్కడ మన ఆడియన్స్ కూడా మోహన్ లాల్ నటనకు ఫిదా అవుతుంటారు. ఇప్పుడు ఈయనపై కేస్ నమోదు చేసి కోర్టులో హాజరు పరచాలని చూస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఏడేళ్ల కింది కేస్ ఇప్పుడు హియరింగ్‌కు వచ్చింది. అసలు విషయం ఏంటంటే 2012లో మోహన్ లాల్ ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతపు కళాఖండాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎర్నాకుళంలోని కోర్టులో అతనిపై చార్జిషీట్ దాఖలైంది.

Forest department files chargesheet against actor Mohanlal in Elephant tusk case pk మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా ఈయన నటించాడు. mohanlal,mohanlal twitter,mohanlal forest department,mohanlal movies,mahonlal jail,mohanlal case,mohanlal elephant tusk,telugu cinema,malayalam cinema,మోహన్ లాల్,మోహన్ లాల్ సినిమాలు,మోహన్ లాల్ మళయాలం సినిమా,మోహన్ లాల్ ఏనుగు దంతాలు
మోహన్ లాల్ (ఫైల్ ఫోటో)

ఏనుగు దంతాల విషయంలో మోహన్ లాల్ ప్రధాన నిందితుడు కూడా. పైగా ఆయన నేరం కూడా ఒప్పుకున్నాడు. ఇక ఇప్పుడు పెరుంబవూరులోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ చార్జ్‌షీటు నమోదైంది. కోదనాడ్ రేం‌లోని మేకప్పల ఫారెస్ట్ స్టేషన్‌లో ఈ కేస్ నమోదైంది. ఈ కేస్ తర్వాత ఏనుగు దంతాల కళాఖండాలను ఇంట్లో ఉంచుకునేందుకు తనకు అనుమతి ఉందని కోర్టుకు తెలిపాడు మోహన్ లాల్. తాను కె కృష్ణన్‌ అయ్యర్‌ అనే వ్యక్తి నుంచి 65 వేల రూపాయలకు వీటిని కొనుగోలు చేశానని మోహన్‌లాల్‌ చెప్పుకొచ్చాడు. కానీ ఆ అనుమతి రావడంలో మోహన్ లాల్‌కు తేడా జరిగింది. ఇదే విషయంపై ఎర్నాకుళం పౌలోస్ అనే పిటిషనర్ హై కోర్టులో సవాల్ చేసారు.

Forest department files chargesheet against actor Mohanlal in Elephant tusk case pk మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా ఈయన నటించాడు. mohanlal,mohanlal twitter,mohanlal forest department,mohanlal movies,mahonlal jail,mohanlal case,mohanlal elephant tusk,telugu cinema,malayalam cinema,మోహన్ లాల్,మోహన్ లాల్ సినిమాలు,మోహన్ లాల్ మళయాలం సినిమా,మోహన్ లాల్ ఏనుగు దంతాలు
మోహన్ లాల్ ఫైల్ ఫోటో
దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం ఏనుగు దంతపు కళాఖండాలను ఉంచుకునేందుకు మోహన్‌లాల్‌కు సరైన అనుమతి లేదని తేల్చేసింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఈయనకు ఎలాంటి అనువైన అనుమతి ఇవ్వలేదని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో కేస్ మళ్లీ మొదటికి వచ్చేసింది. దాంతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3)తో మోహన్‌లాల్‌పై నేరం రుజువు చేయొచ్చని హైకోర్టు తేల్చడం సంచలనంగా మారింది. సూపర్ స్టార్ కావడంతో ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా పిటిషనర్‌ హైకోర్టును కోరాడు. అప్పట్లో మోహన్ లాల్ ఇంట్లో సోదాలు చేసినపుడు కూడా ఐటీ అధికారులు ఆ దంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Forest department files chargesheet against actor Mohanlal in Elephant tusk case pk మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా ఈయన నటించాడు. mohanlal,mohanlal twitter,mohanlal forest department,mohanlal movies,mahonlal jail,mohanlal case,mohanlal elephant tusk,telugu cinema,malayalam cinema,మోహన్ లాల్,మోహన్ లాల్ సినిమాలు,మోహన్ లాల్ మళయాలం సినిమా,మోహన్ లాల్ ఏనుగు దంతాలు
మోహన్ లాల్ ఫైల్ ఫోటో

అప్పట్లో ఇది సంచలనంగా మారింది. ఈ కేసులో మోహన్‌లాల్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసారు అటవీ శాఖ అధికారులు. ఆ ఎఫ్‌ఐఆర్‌ ఇప్పుడు పెరుంబవూర్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట సబ్ మిట్ చేసారు. కాగా కొన్ని రోజుల కింద భారతీయ వన్య ప్రాణి చట్టంలోని సెక్షన్ 44(6) కింద మోహన్ లాల్‌పై కేస్ నమోదు చేసి ప్రధాన నిందితుడిగా కోర్ట్ తేల్చేసింది. ఇప్పుడు ఈ ఏనుగు దంతాల కేస్ ఎక్కడ ఈయన మెడకు చుట్టుకుంటుందో అని నిర్మాతలు కూడా కంగారు పడుతున్నారు.
First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు