హోమ్ /వార్తలు /సినిమా /

Pushpa: పుష్ప ఫీవర్ తగ్గేదేలే... శ్రీవల్లి పాటకు వాయోలిన్ వాయించిన ఫారిన్ అమ్మాయి

Pushpa: పుష్ప ఫీవర్ తగ్గేదేలే... శ్రీవల్లి పాటకు వాయోలిన్ వాయించిన ఫారిన్ అమ్మాయి

కాలిఫోర్నియాలో శ్రీవల్లి సాంగ్

కాలిఫోర్నియాలో శ్రీవల్లి సాంగ్

యూట్యూబ్‌లో 6 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్ బేస్‌ను కలిగి ఉన్న 13 ఏళ్ల వయోలిన్ విద్వాంసురాలు కరోలినా ప్రొట్సెంకో ‘శ్రీవల్లి’ పాట వయోలిన్ వెర్షన్‌ను పోస్ట్ చేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చింది.

పుష్ప.. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్... ఇప్పుడు కేజీఎఫ్ హవా నడుస్తోంది. అయితే... అల్లు అర్జున్ పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాలో పాటలు,డాన్సులు, డైలాగ్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. చిన్నపిల్లాడి నుంచి పండు ముసలి వరకు ఎవర్ని చూసినా పుష్ప పుష్ప అంటున్నారు. ఇక ఈ సినిమా పాటలు సినిమాలోని సాంగ్స్ ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే సినిమా విడుదలై చాలా రోజులే అయినప్పటికీ ఇంకా ‘పుష్ప’ ఫీవర్ తగ్గడం లేదు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది .

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అన్ని వర్గాల ప్రేక్షకులు ‘పుష్ప’రాజ్ మ్యాజిక్ లో పడిపోయేలా ప్రధాన పాత్ర పోషించాయని చెప్పాలి. ‘శ్రీవల్లి’ పాటలోని హుక్ స్టెప్‌తో యూట్యూబ్‌ లో కొంతమంది రచ్చ చేశారు. ఇక చాలామంది సెలబ్రిటీలు సైతం శ్రీవల్లి పాటకు స్టెప్పులేశారు. ఏ వాట్సాప్ గ్రూపుల్లో చూసినా ఇదే పాట తెగ చక్కర్లు కొట్టింది. అయితే తాజాగా ఓ ఫారిన్ అమ్మాయి ‘శ్రీవల్లి’ పాటకు సంబంధించిన మ్యూజిక్ ను వయోలిన్ మీద వాయించి, అందరినీ షాక్‌కు గురయ్యేలా చేసింది. యూట్యూబ్‌లో 6 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్ బేస్‌ను కలిగి ఉన్న 13 ఏళ్ల వయోలిన్ విద్వాంసురాలు కరోలినా ప్రొట్సెంకో ‘శ్రీవల్లి’ పాట వయోలిన్ వెర్షన్‌ను పోస్ట్ చేసి అల్లు అర్జున్ అభిమానులను, పుష్ప ప్రేమికులను ఆశ్చర్యపరిచింది. ఎక్కడో కాలిఫోర్నియాలో ఉన్న ఈ యువతి ‘శ్రీవల్లి’ పాటను ప్లే చేస్తూ అందరినీ ఆకట్టుకుంది.

దీంతో ఇప్పుడు ఈ వీడియోను బన్నీ ఫ్యాన్స్... అల్లు అర్జున్ ఆర్మీ... తెగ వైరల్ చేస్తున్నారు. పుష్ప తగ్గేదేలే అంటూ.. పోస్టులు పెడుతూ... సందడి చేస్తున్నారు. ఇక శ్రీవల్లి పాట ఇంగ్లీష్‌లో కూడా వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో శ్రీవల్లి పాటను సిద్ శ్రీరామ్ పాడారు. ఈ సినిమాలో ఓ పాటను ఇంగ్లీష్​లోకి ట్రాన్స్​లేట్ చేసి మరీ పాడారు ఓ యూట్యూబ్ సింగర్​. emmaheesters అనే యూట్యూబర్​ పుష్ప సినిమాలోని 'శ్రీవల్లి' పాటను ఇంగ్లీష్​లోకి అనువదించి పాడింది. అయితే అమె పాటలో 'చూపే బంగారమాయేనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయేనే..' అనే లిరిక్స్​ను తెలుగులోనే పాడటం విశేషం. మిగతా భాగాన్ని ఇంగ్లీష్​లోకి అనువదించించి పాడింది. అమె స్టైల్లో ఈ పాటకు మ్యూజిక్ జోడించి పాడింది. ఒరిజినల్ సాంగ్​లో ఉన్న ఫీల్​ను కూడా అమె పాటలో ఉండటం విశేషం.

First published:

Tags: Pushpa, Pushpa film, Rashmika mandanna

ఉత్తమ కథలు