FOREIGN FIGHTERS ARE PARTICIPATING IN RRR CLAIMAX MHN
RRR - Rajamouli: 40 మంది గ్యాంగ్‌ని దింపిన రాజమౌళి... ప్లాన్ అదేనా..!
foreign fighters are participating in RRR claimax
RRR - Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ జరగుతోంది. దీని కోసం విదేశీ ఫైటర్‌ను రప్పించాడట జక్కన్న
అప్పుడెప్పుడో తెల్లవాడిని వెళ్లిపొమ్మని మనవాళ్లు స్వాతంత్రపోరాటాలు చేస్తే, ఇప్పుడు రాజమౌళి మాత్రం థింక్ డిఫరెంట్ అంటున్నారు. అప్పట్లో తరిమికొట్టిన వాళ్ల వారసులను ఇప్పుడు టిక్కెట్లేసి మరీ రప్పిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగు మీద కాన్సెన్ ట్రేట్ చేయకుండా రాజమౌళికి ఇదేం పని? అని అనుకుంటున్నారా? జస్ట్ చిల్ బ్రో అని అంటున్నారు రాజమౌళి. ఇప్పుడు ఆయన ఆంగ్లేయులను తీసుకుని వస్తున్నది కూడా షూటింగ్ కోసమే. యస్ ట్రిపుల్ ఆర్ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్లోనే దాదాపు 40 మంది ఆంగ్లేయులు పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను హాలీవుడ్ యాక్షన్ డైరక్టర్ నిక్ పావెల్ కొరియోగ్రాఫ్ చేశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్ అయ్యేలా, ఇన్‌ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ లెవల్లో చూసిన ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.
హాలీవుడ్ యాక్షన్ డైరక్టర్ అయినప్పటికీ, ఇండియన్ టచ్ ఉన్న యాక్షన్ సీక్వెన్స్ ని కంపోజ్ చేయిస్తున్నారట. ఇందులోనే 40 మంది అమెరికన్ ఫైటర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఫైటర్లందరూ ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్లో పాల్గొంటున్నారు. ట్రిపుల్ ఆర్ ప్రీ ఇండిపెండెన్స్ డ్రామా అన్న సంగతి తెలిసిందే. తారక్ కొమరం భీమ్‌గా, చెర్రీ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. వీరిద్దరూ ఎక్కడో ఒకచోట కలిసి ఉంటే, ఫ్రీడమ్ ఫైట్ కోసం చేతులు కలిపి ఉంటే, పరిస్థితులు ఏంటన్న ఊహతో తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద నెవర్ బిఫోర్ సీన్ విజువల్ ట్రీట్‌గా జక్కన్న చెక్కుతున్నారు.
సౌత్ స్టార్స్ తో పాటు నార్త్ స్టార్స్ అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ లు ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ కూడా కీ రోల్స్ చేస్తున్నారు. డీవీవీ దానయ్య 400 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారు. అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని ఇప్పటికే యూనిట్ డిక్లేర్ చేసింది. అయితే ఇంకో 50 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందట. అనుకున్న రిలీజ్ టైమ్ కి స్క్రీన్ ముందుకు రావడం ఎంత వరకు సాధ్యమనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సింది ఒన్ అండ్ ఒన్లీ రాజమౌళి మాత్రమే.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.