Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
|
news18-telugu
Updated: December 20, 2019, 8:16 AM IST
ప్రభాస్,మహేష్ బాబు (Twitter/Photo)
ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ వివిధ రంగాల్లో ఎక్కవ పేరు ప్రఖ్యాతలతో పాటు వారి ఆదాయ వివరాలకు సంబంధించిన జాబితాను విడుదల చేస్తుంటుంది. తాజాగా ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్,సచిన్ టెండూల్కర్ టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. గతేడాది టాప్ 2లో నిలిచిన విరాట్ కోహ్లీ ఈ సారి మాత్రం తొలిస్థానం ఆక్రమించుకున్నాడు. ఈ జాబితాను 1 అక్టోబర్ 2018 నుండి 30 సెప్టెంబర్ 2019 మధ్య ఆయా సెలబ్రిటీలు సంపాదించిన సంపాదనతో పాటు వాళ్ల ఫేమ్ పరంగా ఫోర్బస్ ర్యాంకులు ప్రకటించారు. విరాట్ కోహ్లీ 252.72 కోట్లతో తొలిస్థానంలో నిలవగా ..సెకండ్ ప్లేస్లో అక్షయ్ కుమార్, ఆ తర్వాత స్థానాల్లో సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, మహేంద్ర సింగ్ ధోని, షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్,అలియా భట్,సచిన్ టెండూల్కర్,దీపికాలు టాప్లో 10లో నిలిచారు. తెలుగు నుంచి ప్రభాస్ 44వ స్థానం దక్కించుకున్నాడు. ఇక మహేష్ బాబు 54వ ప్లేస్లో నిలిచాడు. ఈ జాబితాలో త్రివిక్రమ్ 77వ స్థానంలో నిలవడం విశేషం. ఇక కోలీవుడ్ నుండి రజినీకాంత్ 13 ప్లేస్లో నిలవగా.. విజయ్ మాత్రం 47స్థానం దక్కించుకున్నాడు. కమల్ హాసస్ 56వ ప్లేస్లో నిలిస్తే.. మలయాళం నుంచి మోహన్ లాల్ ఈ జాబితాలో 27 ప్లేస్లో నిలిచారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 20, 2019, 8:07 AM IST