హోమ్ /వార్తలు /సినిమా /

Shooting Bandh: రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్..!

Shooting Bandh: రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్..!

రేపట్నుంచి సినిమా షూటింగ్ బంద్

రేపట్నుంచి సినిమా షూటింగ్ బంద్

సినిమా షూటింగ్‌లను రేపట్నుంచి నిలిపి వేస్తున్నట్లు యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

  తెలుగు ఫిలిం చాంబర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం(ఆగస్ట్‌ 1) నుంచి తెలుగు సినిమా షూటింగ్స్‌ నిలిపివేయాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోన్న సినిమాల చిత్రీకరణలు కూడా నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్‌ నిర్ణయం తీసుకుంది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం ఆగస్ట్‌ 1న షూటింగ్స్‌ బంద్‌ చేయాలని టాలీవుడ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

  ఇటీవల హైదరాబాద్‌ లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ లో టిక్కెట్‌ ధరలు, ఓటీటీ విడుదల, కార్మికుల దినసరి వేతనం తదితర సమస్యల పై సమావేశం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్‌లను రేపట్నుంచి నిలిపి వేస్తున్నట్లు యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. తాజా పరిణామంలో, నిర్మాతల సంఘం నిర్ణయాన్ని సమర్ధిస్తూ రేపటి నుంచి సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్ణయించింది. పరిశ్రమ ప్రయోజనాల దృష్ట్యా సామరస్య పూర్వక పరిష్కారం లభించే వరకు షూటింగ్‌లు జరగవు. దీంతో సినిమా షూటింగ్‌ లు అన్నీ నిలిచిపోనున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు రన్నింగ్ లో ఉండగా, మరికొన్ని చిత్రాల షూటింగ్ మొదలు కావాల్సి ఉంది.

  మరోవైపు తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త ప్రెసిడెంట్ గా బసిరెడ్డిని ఎన్నుకున్నారు. మొత్తం 48 మంది ఈసీ మెంబర్స్‌కు ఓటు హక్కు ఉండగా 42 మంది ఈసీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 22ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణపై గెలుపు సాధించారు బసిరెడ్డి. ఈ విజయాన్ని అధికారికంగా ప్రకటన ద్వారా తెలియజేసింది ఫిలిం ఛాంబర్. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన ప్రెసిడెంట్ బసిరెడ్డి...“రేపటి నుంచి సినిమా షూటింగ్ లు బంద్ చెయ్యాలని అనుకున్నామన్నారు. సినిమా ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తారన్నారు. 24 క్రాఫ్ట్స్‌లో అందరికీ ఇబ్బందులు ఉన్నాయన్నారు బసి రెడ్డి.

  అందరికీ న్యాయం చేయాలని చూస్తున్నామన్నారు బసిరెడ్డి. అందరం కలసి నిర్ణయం తీసుకున్నామన్నారు. అందరం రేపటి నుంచి ఫెడరేషన్ సమస్యలపై చర్చలు జరుపుతామన్నారు బసిరెడ్డి రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. జనరల్ బాడి మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మరోసారి కూర్చొని చర్చలు జరుపుతామన్నారు. సమస్యలకి పరిష్కారం దొరికేంత వరుకు ఇదే నిర్ణయంపై ఉంటామన్నారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Film chamber, Tollywood

  ఉత్తమ కథలు