2018 ఎండింగ్ వచ్చేచాం. ఈ యేడాది తెలుగులో ఉన్న అగ్ర కథానాయకులందరూ వెండితెరపై సందడి చేశారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు సిల్వర్ స్క్రీన్‌పై తమ సత్తా ఏందో చూపెట్టారు. కానీ కొంత మంది హీరోలు మాత్రం సినిమాలు చేస్తున్నా 2018లో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయారు.
అందులో ముందుగా చెప్పుకోవాల్సింది చిరంజీవి. 2017లో ‘ఖైదీ నంబర్ 150’ తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్..ఆ తర్వాత కథల విషయంలో ఆచితూచి చివరకు తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై ‘సైరా..నరసింహారెడ్డి’ మూవీ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో 2018లో మెగాస్టార్ దర్శనభాగ్యం ఆడియన్స్‌కు కలగలేదు.
ఇక ‘గురు’మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వెంకటేశ్...అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి ‘ఎఫ్2’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరోవైపు నాగచైతన్యతో చేస్తోన్న ‘వెంకీమామ’ మూవీ కూడా 2019లోనే రానుంది. ఇక 2018లో పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’లో వెంకీ అతిథి పాత్రలో కనిపించడం కొసమెరుపు.
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్..సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ మూవీ చేస్తున్నాడు. ‘బాహుబలి’తో ప్రభాస్ క్రేజ్..ఇండియా వైడ్‌గా పెరిగింది. దీంతో కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. 2018లో వెండితెరపై కనిపించని ప్రభాస్...2019లో వడ్డీతో సహా రెండు సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు.
‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని రానా...2018లో ఆయన నుంచి ఒక్క సినిమా రాలేదు. ఆ లోటును వచ్చే యేడాది ‘1945’, ‘హాథీ మేరా సాథీ’, రాజా రవివర్మపై తెరకెక్కే చిత్రంతో పాటు ‘హౌస్‌ఫుల్4’ సినిమాలతో తీర్చబోతున్నాడు. ఇంకోవైపు ‘హిరణ్యకశ్యప’ మూవీ లైన్‌లో ఉంది. ఈ యేడాది ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రాన్ని నిర్మించిన రానా...మరోవైపు ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలో మాత్రం రానా వాయిస్ ఓవర్ వినిపించడం విశేషం.
అక్కినేని నట వారసుడు ఈ యేడాది సందడి చేయలేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హలో’ మూవీ అఖిల్ హిట్ ఆశలను నెరవేర్చలేదు. దీంతో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’ మూవీ చేసాడు. ఈ యేడాడి చివర్లలో ఈ మూవీ రిలీజ్ చేయాలనుకున్నారు. ఎందుకనో ఈ మూవీ 2019 జనవరికి పోస్ట్ పోన్ అయింది.
మొత్తానికి 2018లో సందడి చేయకపోయిన ఈ కథానాయకులందరూ వచ్చే యేడాది ఒకటికి రెండు సినిమాలతో ఆడియన్స్‌కు అలరించేందుకు రెడీ అయితున్నారు.
ఇది కూడా చదవండి
#FlashBack2018: ఈ ఏడాది టాప్ హీరోయిన్లు వీళ్లే..
#FlashBack2018:2018లో టాప్ 5 కలెక్షన్స్ సాధించిన బాలీవుడ్
సినిమాలు#FlashBack2018: వాళ్లకు ప్రత్యేకం.. స్పెషల్ స్టార్స్ ఆఫ్ 2018..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.