Netflix, Amazon Prime Video, Disney+Hotstar వంటి OTT ల్లోకి 2020లో ఎంటర్ అయిన బాలీవుడ్ (Bollywood) యాక్టర్స్ తమ సత్తా చాటుకున్నారు. ఈ ఏడాది ఓటీటీ OTT ప్లాట్ ఫాంల్లో అడుగు పెట్టిన ఐదుగురు బాలీవుడ్ స్టార్స్ కథా కమామీషు తెలుసుకుందామా.. టెలివిజన్ వేరు ఫిలిం వేరు. ఇదంతా ఒకప్పటి సంగతి. బుల్లితెర నటులంటే చిన్నచూపు, వెండితెర నటులంటే గొప్పగా ఆరాధించే భావన ప్రపంచమంతా ఉండేది. సీరియళ్లు, టెలిఫిలింల్లో నటించే నటులంటే .. ఆ టీవీ యాక్టర్స్ అనేసేవారు. కానీ కోవిడ్-19 అదంతా మార్చేసింది. ముఖ్యంగా ఓటీటీ (OTT) లు వచ్చాక చిన్నతెర, పెద్ద తెర ఇలాంటి తేడాలు ఏం లేవు. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే వారికే ఆఫర్సు అనేలా పరిస్థితి తయారైంది. ఇది గ్రహించిన పెద్ద నటులు, లెజెండరీ నటులు సైతం ఇప్పుడు ఆన్ లైన్ స్ట్రీమ్ అయ్యే ప్రోగ్రామ్స్, ఫార్మాట్స్ పై ఫోకస్ పెడుతున్నారు. OTTల్లో టీవీ నటులు, ఫిలిం యాక్టర్స్ కలిసి నటిస్తూ వినోదాన్ని పంచడంలో పోటీపడుతున్న కొత్త సంప్రదాయం మొదలైంది. ఓటీటీ (OTT)లు ప్లాట్ ఫాంలు మొదలైన కొత్తల్లో కేవలం సినిమాల్లో పెద్దగా ఆఫర్లు లేని సినీ నటులు ఓటీటీ (OTT) ఒరిజినల్ ఫిలింస్ లో కనిపించారు. కానీ కాలక్రమేణ బాలీవుడ్ (Bollywood) స్టార్స్, టాలీవుడ్ స్టార్ ఇలా హిందీ, ప్రాంతీయ సినిమాల్లోని ప్రముఖ నటులు, బిజీ స్టార్సు కూడా ఓటీటీ (OTT) సీరిస్ లపై ఫోకస్ పెట్టడం మొదలైంది.
Off-beat ఎక్కువ :
OTT Original అనగానే ఇవన్నీ ఎక్కువగా ఆఫ్-బీట్ లేదా డేరింగ్ గా ఉంటాయనే పేరు పడిపోయింది. సాధారణంగా టీవీల్లో, సినిమాల్లో చూపని కంటెంట్ నే ఓటీటీ (OTT) ల్లో ప్రమోట్ చేస్తుండటం ఇందుకు కారణం. ఇలాంటి టాపిక్స్ లో కొన్నిసోషియల్ ఇష్యూస్ కూడా ఉండగా మరికొన్ని మైండ్ లెస్ ఎంటర్ టైన్మెంట్ ఉంటున్నాయి.
జూనియర్ బచ్చన్..

బ్రీత్ పోస్టర్ Photo : Twitter
అభిషేక్ బచ్చన్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ద్వారా ఓటీటీ (OTT) లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో పెద్దగా హిట్లు కొట్టలేకపోయిన జూనియర్ బచ్చన్ 2020లో మాత్రం ఓటీటీ (OTT) ల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు "బ్రీత్" అనే క్రైమ్ సిరీస్ లో నటించారు. మరోవైపు నెట్ ఫ్లిక్స్ (NetFlix) ఒరిజినల్ మూవీ "లూడో" లో అనురాగ్ బసు డైరెక్షన్ లో ప్రస్తుతం జూనియర్ బచ్చన్ నటిస్తున్నారు.
సుష్మితా సేన్..

ఆర్య పోస్టర్ Photo : Twitter
డిస్నీ+హాట్ స్టార్ (Disney+HotStar) లో స్ట్రీమ్ (stream) అవుతున్న "ఆర్యా" అనే వెబ్ సిరీస్ లో సుష్మితా సేన్ యాక్ట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న "ఆర్య"లో సుష్మిత యాక్షన్ ఇరగదీశారు. మొత్తానికి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సుష్మిత..తన అభిమానుల కోసం వెబ్ సిరీస్ (web series) లో నటించడం పెద్ద నిర్ణయమే.
ఆఫ్తాబ్ శివదాసాని..
"పాయిజన్-2” అనే వెబ్ షో ద్వారా హీరో ఆఫ్తాబ్ శివదాసాని తన ఓటీటీ (OTT) ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆఫ్తాబ్ ఇలా తన ఫ్యాన్స్ కు దర్శనమివ్వడం విశేషమే. జీ5 (Zee5) లో ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు మంచి ఆదరణ లభిస్తోంది.
నసీరుద్దీన్ షా...

బాందిష్ బండిట్స్ పోస్టర్స్ Photo : Twitter
"బాందిష్ బండిట్స్" అనే అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వెబ్ సిరీస్ తో ఓటీటీ (OTT) లో ఎంట్రీ ఇచ్చారు లెజెండరీ నటులు నసీరుద్దీన్ షా. ఈ వెబ్ సిరీస్ లో ఆయన పాత్ర ఆధారంగా మాత్రమే స్టోరీ నడవకపోయినా చక్కని వెబ్ సిరీస్ (web series) లో నసీరుద్దీన్ నటించి, పలువురి మెప్పు పొందుతున్నారు.
కరిష్మా కపూర్..

మెంటల్ హుడ్ Photo : Twitter
ఒకప్పటి బాలీవుడ్ (Bollywood) నంబర్ 1 స్టార్ కరిష్మా కపూర్ 2020లో ఓటీటీల్లో సందడి చేశారు. ఆల్ట్ బాలాజీ (Alt Balaji) అనే ఓటీటీ (OTT) ప్లాట్ ఫాంలో స్ట్రీమ్ (Stream) అవుతున్న "మెంటల్ హుడ్" అనే వెబ్ సిరీస్ (web Series) మంచి హిట్ గా నిలిచింది. కరిష్మా ఫ్యాన్స్ అంతా మెంటల్ హుడ్-2 కోసం ఆసక్తిగా ఎదురుచూసేంతగా మొదటి సిరీస్ (series) హిట్ అయింది.