Allu Arjun : అల వైకుంఠపురములో సినిమాకు ఐదు అవార్డులు.. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్..

Sakshi excellence awards Photo : Twittter

Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలవైకుంఠపురములో.. ఈ సినిమా 2020లో సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కాగా ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ అవార్డ్ పొందారు.

  • Share this:
    అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలవైకుంఠపురములో.. ఈ సినిమా 2020లో సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఓ రేంజ్‌లో వసూలు చేసింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు మొత్తంగా ఐదు అవార్డ్‌లు దక్కాయి. సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో “అల వైకుంఠపురములో” వివిధ విభాగాలలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకుంది. దీంతో చిత్రబృదం సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు, పూజా హెగ్డే ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత రాధా కృష్ణ అందుకున్నారు. ఇక ఈ సినిమాకు సంగీతం అంధించిన థమన్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు పొందారు.

    ఇదే విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అవార్డుల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. పూజా హెగ్డే, త్రివిక్రమ్, రాధా కృష్ణ, థమన్ లతో కలిసి ఉన్న ఓ ఫోటోను పంచుకున్నారు.




    ఇక ఇదే అవార్డ్ ఫంక్షన్‌లో మహర్షి సినిమాకు మహేష్ బాబు ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సందేశాత్మక చిత్రం 'మహర్షి'లో నటించినందుకు మహేష్‌కు ఈ అవార్డ్ దక్కింది. ఈ చిత్రం 2019లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సాక్షి ఎక్సలెన్స్ (Sakshi Excellence Awards) అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్‌కు సంబంధించిన కార్యక్రమం హైదరాబాద్‌లో జరగగా... మహేష్ బాబు వచ్చి స్వయంగా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.

    'మహర్షి' ఉత్తమ నటుడి అవార్డ్‌తో పాటు మరో రెండు ప్రధాన అవార్డులను కూడా గెలుచుకుంది. 2019 లో విడుదలైన సినిమాలలో ఈ మహర్షి సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు అవార్డు అందుకున్నారు. ఇక 'మహర్షి' సినిమాకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లికి (vamshi paidipally) ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది.

    ఇక అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ సుకుమార్ (Allu Arjun Sukumar) కాంబినేషన్‌లో పుష్ప అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ఇటీవల ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరిగింది.

    ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ (Fahadh Faasil ) ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న  (Rashmika Mandanna) నటిస్తోంది. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

    ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. దీంతో ఈ చిత్రం షూటింగు ఎక్కువ భాగాన్ని అటవీ నేపథ్యంలో జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే కొంత భాగాన్ని కేరళలో చిత్రీకరించిన చిత్రబృందం.. ప్రస్తుతం మారేడు మిల్లి అడువుల్లో చిత్రీకరణ జరుగుతోంది.

    ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే  వస్తోందని టాక్. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో ఈ సినిమా వచ్చే క్రిస్మస్‌కు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
    Published by:Suresh Rachamalla
    First published: