ఇన్నేళ్ల మెగాస్టార్ సినీ నట జీవితంలో మొదటిసారి ఇలా జరిగింది. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి తన సినీ జీవతంలో తొలిసారిగా చారిత్రక పాత్ర పోషించిన సినిమా ‘సైరా..నరసింహారెడ్డి’. ఈ చిత్రంలో చిరంజీవి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రలో నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవితో పాటు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, నయనతార, తమన్నా, కన్నడ నటుడు కిచ్చా సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం నిన్నటితో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. దీంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ట్విట్టర్‌లో ప్రకటించింది.
సైరా ఒక్క హిందీలో తప్ప.. సౌత్ ఇండియా భాషాలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో థియేటర్స్‌లో చిరంజీవి సినిమాను చూడలేని అభిమానులు.. ఎంచక్కా ఇంట్లోనే ఈ సినిమాను చూడొచ్చు. ఇక చిరంజీవి కెరీర్‌లో ఒక సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రదర్శితం కావడం ఇదే ఫస్ట్ టైమ్. గతంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో చిరంజీవి సినిమాల కొన్ని ఉన్నా..అవన్నీ ఎపుడో విడులైన చిత్రాలు. తొలిసారి థియేట్రికల్ రన్ ముగిసిన ఓ సినిమా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రదర్శితం కావడం చిరంజీవి సినీ జీవితంలో ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ‘ఖైదీ నెంబర్ 150’ హాట్ స్టార్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారమయినా... థియేట్రికల్ రన్ ముగిసిన చాలా రోజుల తర్వాత ప్రసారం అయింది. కానీ సైరా మాత్రం.. అలా థియేట్రికల్ ముగిసిందో లేదో ఇలా అమెజాన్‌లో ప్రసారం అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon prime, Bollywood, Chiranjeevi, Kollywood, Konidela Productions, Malluwood, Ram Charan, Sandalwood, Surender reddy, Sye raa narasimhareddy, Tollywood