Home /News /movies /

FIRST SINGLE BUL BUL TARANG FROM RAVI TEJA RAMA RAO ON DUTY TO RELEASED AND GETS GOOD RESPONSE ON SOCIAL MEDIA SR

Ravi Teja | Rama Rao On Duty : రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల.. ఆకట్టుకుంటోన్న బుల్ బుల్ తరంగ్..

Bul Bul Tarang from Ravi Teja Rama Rao On Duty released Photo : Twitter

Bul Bul Tarang from Ravi Teja Rama Rao On Duty released Photo : Twitter

Ravi Teja | Rama Rao On Duty : రవితేజ తన 68వ సినిమాగా ‘రామారావు’ (Raviteja Ramarao On Duty) అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ (Rajisha Vijayan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్‌ను వదిలింది చిత్రబృందం.

ఇంకా చదవండి ...
  Ravi Teja | మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) లాస్ట్ ఇయర్ 2021లో కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత ‘క్రాక్’ మూవీతో బంపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా 2021 తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి ఆయనకు కొత్త ఊపిరిని ఇచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా రవితేజ తన 68వ సినిమాగా ‘రామారావు’ (Raviteja Ramarao On Duty) అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ (Rajisha Vijayan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక అది అలా ఉంటే ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది టీమ్. బుల్బుల్ తరంగ్ (Bul Bul Tarang)అంటూ సాగుతోన్న ఈ పాట నెటిజన్స్‌ను బాగానే ఆకట్టుకుంటోంది. సిద్ శ్రీరామ్ (Sid Sriram) పాడగా.. రాకేందు మౌళి లిరిక్స్ అందించారు. ఈ పాటను స్పెయిన్‌లో చిత్రీకరించింది టీమ్. యదార్థ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, సర్పట్ట జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ కనిపించనున్నారు. రామారావు ఆన్ డ్యూటీ జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

  ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) అనే ఓ ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి రవితేజ  (Ravi Teja) లుక్‌ను విడుదల చేసింది టీమ్. ఈ (Tiger Nageswara Rao) సినిమా కోసం రవితేజ లుక్ మాత్రం ఊహించని రేంజ్‌లో ఉందని చెప్పాలి. రవితేజ 71వ చిత్రంగా వస్తున్న టైగర్ కోసం రవితేజ సిక్స్ ప్యాక్ బాడీలో రాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రవితేజ సరసన నుపుర్ సనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. నుపుర్ సనన్ (Nupur Sanon) విషయానికొస్తే.. ఈమె ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు. మరో హీరోయిన్‌గా గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. ఇక  ‘టైగర్ నాగేశ్వరరావు’ విషయానికొస్తే.. రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ. తాను దోచుకున్న దాంట్లో పేదలకు సాయం చేస్తుండేవారు. అందుకే ఆయనకు ప్రజల్లో ఎంతో పేరుండేది. ఈయన్ని బ్రిటిష్ పట్టుకొని ఉరి తీశారు. ఓ రకంగా ఉన్నవాళ్లను దోచుకొని .. బీద సాదలకు పెట్టడం ఈయన్ని అందరు ముందుగా ‘టైగర్ నాగేశ్వరరావు’ అని పిలిచేవారు. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


  రవితేజ టైగర్‌తో పాటు మరో రెండు చిత్రాలను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నారు. దీంతో పాటు రవితేజ కెరీర్‌లో 70వ సినిమాగా ‘రావణాసుర’ (Ravanasura) చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. ఇక రవితేజ నటించిన తాజాగా ఖిలాడి (Khiladi) . రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ (Khiladi) సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఖిలాడి మార్చి 11 నుంచి హాట్ స్టార్‌లో (Khiladi on Hotstar) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో డింపుల్ హయాతీ (Dimple Hayathi), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించారు. యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Rama Rao, Raviteja, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు