హోమ్ /వార్తలు /సినిమా /

Hello Meera: సింగల్ క్యారెక్టర్‌తో హలో మీరా.. ఫస్ట్ లుక్ రిలీజ్

Hello Meera: సింగల్ క్యారెక్టర్‌తో హలో మీరా.. ఫస్ట్ లుక్ రిలీజ్

Hello Meera News 18

Hello Meera News 18

'హలో మీరా' అంటూ ఓ వైవిధ్యభరితమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు. ప్రముఖ దర్శకులు శ్రీ బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి ఈ ''హలో మీరా'' సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు కాకర్ల శ్రీనివాసు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రయోగాత్మక కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఎంతో శ్రమ దాగి ఉంటుంది. ఆసక్తికర కథ, కథనంతో ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో డిఫరెంట్ దారులు వెతుకుతూ తమ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు కొందరు దర్శకులు. అదే బాటలో తాజాగా ''హలో మీరా'' (Hello Meera) అంటూ ఓ వైవిధ్యభరితమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు (Kakarla Srinivas). ప్రముఖ దర్శకులు శ్రీ బాపు (Bapu) గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి ఈ ''హలో మీరా'' సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు కాకర్ల శ్రీనివాసు.

తొలి సినిమానే తనకు ఎంతో స్పెషల్ కావాలని హలో మీరా కథపై కసరత్తులు చేసి ప్రేక్షకులు వినూత్న అనుభూతి పొందేలా ఆవిష్కరించబోతున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించారు. కేవలం సింగిల్ క్యారెక్టర్ తో సినిమాను నడిపించి థ్రిల్ చేయనుండటం ఈ మూవీ ప్రత్యేకత. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ గా కథ మొత్తం కూడా మీరా అనే పాత్ర చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు అనుక్షణం సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తుందని మేకర్స్ అంటున్నారు.

తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. ఈ పోస్టర్ లో ప్రధాన పాత్ర అయిన మీరాను చూపిస్తూ కథలోని యాంగిల్ ఏంటనేది స్పష్టం చేశారు. మీరా వెనకాల కనిపిస్తున్న ప్రకాశం బ్యారేజ్, ఆకాశంలో పక్షులు ఎగురు తుండటం చూస్తుంటే ఈ సినిమాలో ఊహకందని సస్పెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగే ప్రయాణమే ఈ సినిమా అని.. ఖచ్చితంగా ఇది ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతినిస్తుందని దర్శకుడు కాకర్ల శ్రీనివాసు అంటున్నారు. తెరపై కనిపించే మీరాతోపాటు ఫోన్ కాల్స్ లో వినిపించే పాత్రలు మరింత ఉత్కంఠ రేపుతాయట. అతి త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు. సూరి సాధనాల అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు.

డా: లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా.. ఎస్ చిన్న సంగీతం అందించారు. అనంత శ్రీధర్ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. తిరుమల ఎం తిరుపతి పొడక్షన్ డిజైనర్ గా, కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై] ప్రొడక్షన్ మేనేజర్స్ గా పని చేశారు. హిరణ్మయి కల్యాణ్ మాటలు రాశారు. రాంబాబు మేడికొండ ఎడిటర్ గా వర్క్ చేశారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Cinema, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు