జగపతి బాబు..బాలీవుడ్‌లోనూ ల్యాండ్ అవుతున్నాడు..!

ప్రస్తుతం జగపతి బాబు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ విలన్‌గా మారిపోయాడు. అంతేకాదు ఇపుడు బాలీవుడ్ ఆడియన్స్‌కు తన విలనిజాన్ని చూపెట్టడానికి రెడీ అవుతున్నాడు.

news18-telugu
Updated: September 4, 2018, 5:20 PM IST
జగపతి బాబు..బాలీవుడ్‌లోనూ ల్యాండ్ అవుతున్నాడు..!
తానాజీ మూవీలో జగపతి బాబు లుక్
  • Share this:
ఎప్పుడైతే జగపతి బాబు ‘లెజెండ్’ మూవీలో విలన్‌గా నటించాడో అప్పటి నుంచి ప్రతినాయకుడిగా ఫుల్ బిజీ అయిపోయాడు. ఒకవైపు విలన్‌గా నటిస్తూనే ..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగుతో పాటు మిగతా సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని దున్నేస్తున్నాడు.

ప్రస్తుతం జగపతి బాబు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ విలన్‌గా మారిపోయాడు. అంతేకాదు ఇపుడు బాలీవుడ్ ఆడియన్స్‌కు తన విలనిజాన్ని చూపెట్టడానికి రెడీ అవుతున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్న జగ్గూభాయి ఇపుడు అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తున్న ‘తానాజీ’ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ మూవీలో జగపతిబాబుకు సంబంధించిన లుక్‌ను సోషల్ మీడియాలో లీకై హల్‌చల్ చేస్తోంది.

ఛత్రపతి శివాజీ దగ్గర సుబేదార్‌గా పనిచేసిన ‘తానాజీ’ జీవిత కథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఓం రావత్ డైరెక్ట్ చేస్తున్నాడు. మరోవైపు జగపతిబాబు హిందీతో పాటు ఒక పంజాబీ సినిమాలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పాడు. మొత్తానికి బాలయ్య, బోయపాటి శ్రీనుల ‘లెజెండ్’ పుణ్యామా అని జగపతి బాబు చేతినిండా  సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు.

ఇది కూడా చదవండి

ముహూర్తం ఫిక్స్ చేసుకున్న ప్రభాస్

షారుఖ్‌ను ఆదుకున్న సల్మాన్ తండ్రి

డేనియల్ క్రేగ్ తర్వాత నెక్ట్స్ జేమ్స్ బాండ్ ఎవరు ?
Published by: Kiran Kumar Thanjavur
First published: September 4, 2018, 5:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading