శ్రీముఖి సర్‌ప్రైజ్.. ఇట్స్ టైమ్ టూ పార్టీ అంటున్న బ్యూటీ..

Sreemukhi: బుల్లితెరపై రాములమ్మగా చెలరేగిపోయి ఫుల్ ఎనర్జీతో కనిపించే ప్రముఖ యాంకర్ శ్రీముఖి. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. దానికి తోడు గతేడాది బిగ్ బాస్ 3కి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 10, 2020, 2:44 PM IST
శ్రీముఖి సర్‌ప్రైజ్.. ఇట్స్ టైమ్ టూ పార్టీ అంటున్న బ్యూటీ..
యాంకర్ శ్రీముఖి హాట్ షో (Anchor Sreemukhi)
  • Share this:
బుల్లితెరపై రాములమ్మగా చెలరేగిపోయి ఫుల్ ఎనర్జీతో కనిపించే ప్రముఖ యాంకర్ శ్రీముఖి. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. దానికి తోడు గతేడాది బిగ్ బాస్ 3కి వెళ్లొచ్చిన తర్వాత అమ్మడి క్రేజ్ డబుల్ అయిపోయింది. ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా మ్యాజిక్ చేయాలని చూస్తుంది శ్రీముఖి. మే 10న ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈమె నటించిన 'ఇట్స్ టైమ్ టు పార్టీ' సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాతో గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు.

శ్రీముఖి ఇట్స్ టైమ్ టూ పార్టీ (Its time To Party Sreemukhi)
శ్రీముఖి ఇట్స్ టైమ్ టూ పార్టీ (Its time To Party Sreemukhi)


ఎయిన్స్ మోషన్ పిక్చర్స్, కాక్ టైల్ సినిమాస్ పతాకంపై అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్ నిర్మించారు. మే 10న శ్రీముఖి పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత గౌతమ్ ఇ.వి.ఎస్ మాట్లాడుతూ.. ఇదొక సైబర్ క్రైమ్ థ్రిల్లర్ అని.. నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో యువతరం జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది. సినిమాలో శ్రీముఖి ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం లేదని.. కానీ ఆమెది చాలా కీలకమైన పాత్ర అని తెలిపారు దర్శక నిర్మాతలు.

యాంకర్ శ్రీముఖి హాట్ షో (Anchor Sreemukhi)
యాంకర్ శ్రీముఖి హాట్ షో (Anchor Sreemukhi)


ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి పాత్రలో శ్రీముఖి నటించలేదని.. ఆమె అభిమానులకు, ప్రేక్షకులకు ఈ క్యారెక్టర్ సర్ ప్రైజ్ ఇస్తుందని చెబుతున్నారు వాళ్లు. శ్రీముఖి కూడా ఈ సినిమా తర్వాత కెరీర్ గాడిన పడుతుందని ఆశిస్తుంది. ఈ సినిమాలో శ్రీముఖి, దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ తదితరులు నటించారు. దీనికి ఫణి కందుకూరి, నాయుడు సురేంద్ర కుమార్ పిఆర్ఓలుగా ఉన్నారు. మరి చూడాలిక.. ఈ చిత్రంతో శ్రీముఖి ఏం మాయ చేస్తుందో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: May 10, 2020, 2:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading