పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ ‘రొమాంటిక్’ సెట్లో అగ్నిప్రమాదం..

పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా 'రొమాంటిక్'. ఈ మధ్యే ఫస్ట్ లుక్ విడుదలైంది ఈ చిత్రానిది. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటే విమర్శలు కూడా వచ్చాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 15, 2019, 1:12 PM IST
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ ‘రొమాంటిక్’ సెట్లో అగ్నిప్రమాదం..
రొమాంటిక్ సినిమా సెట్‌లో ఫైర్ యాక్సిడెంట్
  • Share this:
పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా 'రొమాంటిక్'. ఈ మధ్యే ఫస్ట్ లుక్ విడుదలైంది ఈ చిత్రానిది. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటే విమర్శలు కూడా వచ్చాయి. ఇలాంటి సినిమాలు పూరీ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడంటూ ఆయనకు కూడా విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ చిత్ర సెట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది. ఇన్‌డోర్ సెట్‌లో షూటింగ్ జరుపుకుంటుంది రొమాంటిక్ సినిమా. అలా జరుగుతున్న సమయంలోనే ముందు అక్కడున్న ఓ బట్టకు మంట అంటుకుంది. ఆ తర్వాత అంతా రాజుకుంది.
Fire accident in Puri Jagannadh son Akash Puri Romantic movie set and video goes viral in Social media pk పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా 'రొమాంటిక్'. ఈ మధ్యే ఫస్ట్ లుక్ విడుదలైంది ఈ చిత్రానిది. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటే విమర్శలు కూడా వచ్చాయి. fire accident,fire accident in romantic movie,fire accident romantic movie sets,romantic,romantic movie,romantic movie 1st look,romantic movie first look,akash puri romantic movie,ketika sharma romantic movie,ketika sharma twitter,puri jagannadh akash ketika sharma romantic movie,charmy kaur romantic movie,telugu cinema,రొమాంటిక్,రొమాంటిక్ మూవీ,రొమాంటిక్ ఫస్ట్ లుక్ పోస్టర్,పూరీ జగన్నాథ్ ఆకాశ్ పూరీ,తెలుగు సినిమా,రొమాంటిక్ సెట్స్‌లో ఫైర్ యాక్సిడెంట్
రొమాంటిక్ పోస్టర్ (Source: Twitter)

యూనిట్ సభ్యులు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించినా కూడా క్లాత్ కావడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. షూటింగ్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు హీరో హీరోయిన్లు ఉన్నారా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఆల్రెడీ షూటింగ్ అయిపోయిన తర్వాత అగ్నిప్రమాదం జరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ మధ్య సైరా సినిమా సమయంలో కూడా ఇదే జరిగింది. షూట్ అంతా అయిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అయింది.
Fire accident in Puri Jagannadh son Akash Puri Romantic movie set and video goes viral in Social media pk పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా 'రొమాంటిక్'. ఈ మధ్యే ఫస్ట్ లుక్ విడుదలైంది ఈ చిత్రానిది. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటే విమర్శలు కూడా వచ్చాయి. fire accident,fire accident in romantic movie,fire accident romantic movie sets,romantic,romantic movie,romantic movie 1st look,romantic movie first look,akash puri romantic movie,ketika sharma romantic movie,ketika sharma twitter,puri jagannadh akash ketika sharma romantic movie,charmy kaur romantic movie,telugu cinema,రొమాంటిక్,రొమాంటిక్ మూవీ,రొమాంటిక్ ఫస్ట్ లుక్ పోస్టర్,పూరీ జగన్నాథ్ ఆకాశ్ పూరీ,తెలుగు సినిమా,రొమాంటిక్ సెట్స్‌లో ఫైర్ యాక్సిడెంట్
నటుడు ఆకాష్ పూరి, హిరోయిన్ కేతిక శర్మ

ఇప్పుడు రొమాంటిక్ సినిమా సెట్ విషయంలో కూడా ఇదే జరిగిందేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కేతిక శర్మ నటిస్తుంది. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దీనికి దర్శకుడు. బోల్డ్‌ కంటెంట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అనిల్. ఏదేమైనా ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది రొమాంటిక్. మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలిక.
First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading