ఆఫీసర్ ఫెయిలయ్యాడు, రాజుగాడు తడబడ్డాడు , అభిమన్యుడు పర్వాలేదు

news18
Updated: June 6, 2018, 2:05 PM IST
ఆఫీసర్ ఫెయిలయ్యాడు, రాజుగాడు తడబడ్డాడు , అభిమన్యుడు పర్వాలేదు
  • News18
  • Last Updated: June 6, 2018, 2:05 PM IST
  • Share this:
సమ్మర్ హాలిడేస్ ఎండింగ్ కి వచ్చేశాయి. ఈ వేసవిలో టాలీవుడ్లో  పలు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకొన్నాయి. 'రంగస్థలం' , 'భరత్ అనే నేను' మరియు 'మహానటి' లు ఈ సమ్మర్ లో  బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి.   మరో వారంలో స్కూళ్ళు  స్టార్ట్ కాబోతుండగా ఈ శుక్రవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి  మూడు సినిమాలు 'ఆఫీసర్' , 'రాజుగాడు' మరియు 'అభిమన్యుడు' వచ్చాయి. మరి ఇప్పుడు ఆ సినిమాలు  ప్రేక్షకుల మెప్పు పొందాయో లేదో చూద్దాం ...

‘ఆఫీసర్‌’:-

నాగ్ -వర్మ అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చే సినిమా 'శివ' మరి వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన  'ఆఫీసర్' మూవీలో  కాన్సెప్ట్ బాగానే ఉన్న దాన్ని సినిమాగా తీయడంలో మాత్రం వర్మ  ఫెయిల్ అయ్యాడు. విలన్ పాత్ర సరిగా లేకపోవడం, హీరోకి విలన్ కి మధ్యన జరిగే  సీన్స్  వీక్ గా  ఉండటం సినిమా ఫ్లోను దెబ్బతీశాయి. మూవీ  మరీ బాగోలేదని చెప్పలేం కానీ సరిగాలేని స్క్రీన్ ప్లే  మూవీ  రిజల్ట్ తారుమారు చేసిందనోచ్చు. నాగార్జున  సిన్సియర్ నటన తప్ప ఈ సినిమా చూడదగ్గ  వేరే అంశాలేవీ లేవు. ఫైనల్ గా  చెప్పాలంటే చాలా కాలం తర్వాత పోలీస్ పాత్ర ధరించిన నాగార్జున అగ్రెసివ్ పెర్ఫార్మెన్స్ ను చూడాలనుకునే వాళ్ళకు తప్ప మిగతా వారికి ఈ చిత్రం పెద్దగా నచ్చదు.

అభిమన్యుడు :-విశాల్ సినిమాలు అంటే ఒకప్పుడు మంచి మసాలా యాక్షన్  సినిమాలు గుర్తుకొచ్చేవి .కానీ  గత కొంత కాలంగా తన పంథా మార్చి కొత్తదనం ఉన్న సినిమాలను ఎంచుకొంటున్నాడు . అందులో బాగంగా వచ్చిన సినిమానే  'అభిమన్యుడు'  చిత్రం మనీ, మైండ్ గేమ్ అనే కీలక అంశాలతో తెరకెక్కింది. మిత్రన్ రాసుకొన్న స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగుతుంది. అన్నిరకాలుగా ఈ సినిమా బాగున్నప్పటికీ తమిళ నేటివిటీ ఇబ్బందిగా ఉంటుంది. వినోదం ఎబ్బెట్టుగా ఉంటుంది. విశాల్, అర్జున్ కోసం ఈ సినిమాను వీకెండ్ కాలక్షేపంగా ఓ సారి చూడవచ్చు.‘రాజుగాడు’:-యంగ్ హీరోల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళలో రాజ్ తరుణ్ ఒకడు. కెరీర్ స్టార్టింగ్‌లోనే హ్యాట్రిక్ హిట్ కొట్టి.. మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత కాస్త తడబడ్డాడు. ఇప్పుడు తాజగా 'రాజుగాడు' తో మన ముందుకు వచ్చాడు.   ‘రాజుగాడు’ మూవీ  పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది. రాజేంద్ర ప్రసాద్ నటన, అక్కడక్కడా పేలిన కొన్ని కామెడీ సీన్స్, హీరో పాత్ర ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు లేవు . వీక్ స్క్రీన్ ప్లే ,  ఆశించినంత  కామెడీ లేకపోవడం, బోరింగ్  క్లైమాక్స్  సినిమాకు మైనస్ గా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే  కాన్సెప్ట్ బాగున్నా స్క్రీన్ ప్లే  సరిగాలేని ఈ  మూవీ నుండి ఫుల్ టైమ్  ఎంటర్టైన్మెంట్ ను ఆశిస్తే మాత్రం నిరుత్సాహం తప్పదు.
Published by: Sunil Kumar Jammula
First published: June 1, 2018, 10:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading