news18-telugu
Updated: November 3, 2020, 9:17 AM IST
అమితాబ్ బచ్చన్ (Twitter/Photo)
Amitabh Bachchan KBC | కరోనా పై పోరాడి గెలిచిన అమితాబ్ బచ్చన్.. ఇపుడు కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 12కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఒక్క సీజన్ తప్పించి మిగతా అన్ని సీజన్స్‌కు గత ఇరవై ఏళ్లుగా అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కేబీసీలో కొన్ని కీలక మార్పులు చేసారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ షోను ప్రేక్షకులు లేకుండానే రన్ చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ శుక్రవారం ‘కరమ్‌వీర్’ పేరిట కేబీసీ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేసింది. ఈ స్పెషల్ ఎపిసోడ్లో యాక్టర్ అనూప్ సోనితో పాటు సోషల్ యాక్టివిస్ట్ బెజవాడ విల్సన్ అమితాబ్ ఎదురుగా హాట్ సీటులో కూర్చొని ఈ గేమ్ ఆడారు. ఈ సందర్భంగా ఈ షోలో అడిగిన ఓ ప్రశ్న హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని కేబీసీ హోస్ట్ అమితాబ్ బచ్చన్‌తో పాటు కేబీసీ నిర్వాహకులు, సోనీ టీవీపై యూపీలోని లక్నోలోని ఓ పోలీస్ స్టేషన్లో FIR నమోదు అయింది.
ఇక రూ. 6,40,000 క్యాష్ ప్రైజ్‌కు సంబంధించిన క్వశ్చన్ ఇపుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది. అంతేకాదు ఈ సందర్భంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమం కొంత మంది మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందని సోషల్ మీడియా వేదికగా కొంత మంది నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇంతకీ నెటిజన్ల ఆగ్రహానికి గురైన ఆ ప్రశ్న ఏదనే విషయానికొస్తే..
1927 డిసెంబర్ 25న భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌గారు ఆయన అనునయులు వేటిని తగలబెట్టారు. ?
ఆప్షన్స్ విషయానికొస్తే..
(A) Vishnu Purana (విష్ణు పురాణ) (B) Bhagavad Gita (భగవద్గీత), (C) Rigdev (ఋగ్వేద) (D) Manusmriti (మను స్మృతి). అనే ఆప్షన్ ఇచ్చారు.
ఈ ప్రశ్నకు జవాబుగా మను స్మృతి అనే ఆన్సర్ ఇచ్చేటపుడు బిగ్‌బీ ...మనుస్మృతిని ఆనాడు బీఆర్ అంబేద్కర్ తగలబెట్టిన విషయాన్ని వివరించారు. మరికొందరు కావాలనే ఈ క్వశ్చన్‌తో కేబీసీ వాళ్లు హిందువుల మనోభావాలను దెబ్బ తీసారని ఆరోపిస్తూ.. కేబీసీ తీరుపై మండిపడుతున్నారు. ఈ విషయమైన ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ.. కేబీసీ ప్రోగ్రామ్ కమ్యూనిస్టులకు వేదికగా మారిందంటూ మండిపడ్డారు.
ఇంకొందరు ఈ ప్రోగ్రామ్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా లెఫ్ట్ వింగ్ ప్రోపగాండగా నడుస్తోందని ఆరోపిస్తున్నారు. మొత్తంగా కేబీసీ ప్రోగ్రామ్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందంటూ చాలా మంది నెటిజన్లు బాయ్‌కాట్ కేబీసీ అంటూ ఈ ప్రోగ్రామ్ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 3, 2020, 9:17 AM IST