Bhoomi Trivedi: ప్రముఖ సింగర్‌ భూమి‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు.. మరో సింగర్ రాహుల్‌పై కూడా.. కేసు ఏమిటంటే..

భూమి త్రివేది (Image-Instagram)

ప్రముఖ సింగర్‌ భూమి త్రివేదిపై (Bhoomi Trivedi) పోలీసులు ఎప్‌ఐఆర్‌ నమోదు అయింది. ఆమెతో పాటు సింగర్‌ రాహుల్ వైద్యపై (Rahul Vaidya) కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

  • Share this:
    ప్రముఖ సింగర్‌ భూమి త్రివేదిపై (Bhoomi Trivedi) ఎప్‌ఐఆర్‌ నమోదు అయింది. ఆమెతో పాటు సింగర్‌ రాహుల్ వైద్యపై (Rahul Vaidya) కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఇందుకు కారణం వీరు పాడిన ‘గర్బే కి రాత్’(Garbe Ki Raat) అనే పాట. రాహుల్ వైద్య, భూమి త్రివేది పాడిన ఈ పాట వీడియో వెర్షన్ సోషల్ మీడియాలో విడుదలైన వెంటనే వివాదస్పదంగా మారింది. ఈ పాటకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నిరసనలు మొదలయ్యాయి. ముఖ్యంగా గుజరాతీ ప్రేక్షకులు ఈ పాటపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పాటలో తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని చాలా మంది పేర్కొన్నారు.

    ఇక, ఈ పాటు రాహుల్ శెట్టి దర్శకత్వం వహించారు. ఆయనే కొరియోగ్రఫీ కూడా చేశారు. సాంగ్ వీడియోలో రాహుల్ వైద్య, నటి నియా శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ పాటలో గుజరాతీ జానపద పాట 'రమ్వా ఆవో మది' (Ramva Aavo Madi) లోని ఒక భాగం తీసుకోబడింది. ఇది అభ్యంతకరంగా వినియోగించడంతో చాలా మంది భక్తులను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ పాట వీడియోను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

    కొంపముంచిన Google Maps.. ఊహించని మలుపు తిరిగిన ప్రయాణం.. అసలేం జరిగిందంటే..


    RahulVaidya/BhumiTrivedi instagram


    ఈ వివాదంపై స్పందించిన భూమి త్రివేది ETimesతో మాట్లాడారు. జరిగిన దానికి క్షమాపణ చెప్పారు. ‘ఒక గాయనిగా నేను పాటకు సంబంధించి నా ఆడియో రికార్డింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత నా పనుల్లో నేను ఉన్నాను. ఆ వీడియోతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను వీడియో చూసిన వెంటనే దాన్ని నా సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించాను. అలాంటి ప్రాతినిధ్యాన్ని నేను ఖండిస్తున్నాను. మేము గుజరాత్‌లో పాడే పాటలను, వాటి సారాన్ని గౌరవిస్తాం’అని చెప్పారు.






    Kerala Rains: కేరళలో వర్ష బీభత్సం.. ఆరుగురు మృతి.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్.. భయానకంగా పరిస్థితులు Photos

    సూరత్‌లోని అమ్రోలీ పోలీస్ స్టేషన్‌లో(Amroli Police Station, surat) జేకే రాజ్‌పుత్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సాంగ్ ద్వారా మత విశ్వాసాన్ని అవమానించడం, తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలను బాధపెట్టడం జరిగిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పాటను YouTube ఛానెల్ నుండి తొలగించి.. ప్రమోషన్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: