CarryMinati Ajey Nagar: డిజిటల్ విధానం ప్రపంచం గతి మారుస్తోంది. మానవ కమ్యూనికేషన్ విధానాల్ని డిజిటల్ మేలి మలుపు తిప్పింది. అత్యంత తక్కువ కాలంలోనే ఎక్కువ మందిని ప్రభావితం చేసింది. జేట్ స్పీడ్‌గా ప్రతి ఒక్కరికీ చేరువై కొత్త విప్లవానికి డిజిటల్ పునాదులు వేసింది. భావితరాలకు ఓ గొప్ప వేదికను కూడా సృష్టించింది. ముఖ్యంగా యువత ఈ డిజటల్ ఫ్లాట్‌ఫామ్ ఉపయోగించుకుని రాత్రికి రాత్రికి సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. ఈ తరం యువత సాంకేతిక వైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు ఈ వేదికపై అద్భుతాలు స్పష్టిస్తున్నారు. అలాగే ఈ క్రేజీయే యువతను చేడు మార్గం వైపుగా నడిపిస్తోంది. వారి వ్యక్తికరణ హద్దులు దాటుతుంది.
తాజాగా స్టార్ యూట్యూబర్ అజేయ్ నెగర్‌పై కేసు నమోదైంది. తన ఛానెల్ పాప్‌లారీటి కోసం మహిళలపై అభ్యంతరకరమైన కంటెంట్ పోస్ట్ చేసినందుకు అతనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అజేయ్ నగర్ ఛానెల్ క్యారీమినాటిపై ఢిల్లీకి చెందిన న్యాయవాది గౌరవ్ గులాటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉత్తర డిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ అతనిపై చర్యలకు ఆదేశించారు. మహిళల అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు యూట్యూబర్ క్యారీమినాటిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని గౌరవ్ డిమాండ్ చేశారు. ఐపిసి సెక్షన్లు 354, 509, 293తో పాటు 3/6/7 మహిళా అసభ్య ప్రాతినిధ్య చట్టం 1986 అలాగే ఐటి యాక్ట్ 2008 సెక్షన్ 67 కింద ఛార్జ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
క్యారీ మినాటి గురించి....
క్యారీ మినాటిని ఛానెల్‌ను అకా అజేయ్ నెగర్ అనే యువ యూట్యూబర్ దీన్ని నిర్వహిస్తున్నాడు. అతను లైవ్ గేమ్‌ను తన ఛానెల్‌లో టెలికాస్ట్ చేస్తూ యువతలో మంచి పాప్‌లాలరీటిని సంపాదించాడు. ఈ 20 ఏళ్ల యూట్యూబర్ తన 10 సంవత్సరాల వయసులోనే ఈ ఛానెల్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం అతని ఛానెల్‌కు 31.9 మిలియన్ సబ్‌స్కైబర్స్ ఉన్నారు. అలాగే అజేయ్ సోదరుడు విల్లీ ఫ్రెంజీతో కలిసి చేసిన కామెడీ స్కిట్స్, మ్యూజిక్ వీడియోలను అందులో పోస్ట్ చేస్తుంటాడు. ది హాసమ్ ప్లేస్ వి కాల్ స్కూల్, మేరీ యువర్ డ్రీమ్ పార్ట్‌నర్, ఫిల్మ్ ది ఫ్లేర్ వంటి అనేక హిట్ వీడియోలతో స్టార్ యూట్యూబర్‌గా ఎదిగాడు. 2014 లో ఈ ప్లాట్‌ఫామ్ ప్రారంభించి చేరినప్పటి నుండి ఇప్పటివరకు 2,531,555,816 కంటే ఎక్కువ వీక్షణలను సంపాదించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Carryminati, Delhi, Film The Flare among ఒథెర్స్, Gaurav gulati, He Awesome Place We Call School, Marry Your Dream Partner