FILMMAKER SAI SRIRAM SENSATIONAL COMMENTS ON KAMAL HAASAN AND AJITH SU
కమల్ హాసన్, అజిత్‌లు ద్రోహం చేశారు.. సంచలన కామెంట్స్ చేసిన సాయి శ్రీరామ్
కమల్ హాసన్ (Kamal Haasan)
కమలహాసన్, అజిత్ భరతనాట్యానికి ద్రోహం చేశారని నటుడు, దర్శక నిర్మాత సాయి శ్రీరామ్ సంచలన ఆరోపణలు చేశారు. భరతనాట్య కళాకారుడిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ముందుకు రావడం లేదనే తప్పుడు సంకేతాలను వారి చిత్రాల ద్వారా కల్పించారని అన్నారు.
తమిళ నటులు కమల్ హాసన్, అజిత్‌లపై నటుడు, దర్శక నిర్మాత సాయి శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరు భరతనాట్యానికి తీవ్ర ద్రోహం చేశాడని ఆరోపించారు. ఇటీవల సాయి శ్రీరామ్ భరత నాట్యం నేపథ్యంలో కుమారసంభవం చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిని సాయి శ్రీరామ్.. తమిళనాట అగ్ర నటులైన కమల్ హాసన్, అజిత్‌లు లక్ష్యంగా మాటల దాడికి దిగారు. తాను మాత్రమే కాకుండా తన తండ్రి పీకే ముత్తు కూడా భరతనాట్య కళాకారుడిగా ఉన్నరని తెలిపారు. పలు చిత్రాలకు నృత్య దర్శకుడిగా కూడా పనిచేశాడని చెప్పారు. తన తండ్రి శివాజీ గణేషన్‌కు భరతనాట్యం నేర్పించాడని చెప్పుకొచ్చారు. అయితే కొంతకాలంగా భరతనాట్య కళను అవమానపరిచే విధంగా సినిమాల్లో చూపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘వరలారు చిత్రంలో నటుడు అజిత్ భరతనాట్యం నేర్చుకోవడం వల్లే అతనికి వివాహం జరగలేదని చూపెట్టారు. అదేవిధంగా ఓ చిత్రంలో నటుడు కమల్ హాసన్ భరతనాట్య కళాకారుడు కావడం వల్లే భార్య ఆయన్ని వదిలి వెళ్లిపోయినట్లు చిత్రీకరించారు. కమల్ హాసన్ వంటి నటులు ఇలాంటి చిత్రాలు చేయడం షాక్‌కు గురిచేసింది. ఇలా భరత నాట్య కళాకారుడిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడరనే తప్పుడు సంకేతాలను చిత్రాల ద్వారా కల్పిస్తున్నారు’అని సాయి శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే కుమారసంభవం చిత్రంలో భరతనాట్యం గురించి ఉన్న తప్పుడు ప్రచారాలను తొలగిస్తామని చెప్పారు. ఇప్పటికే చిత్రం షూటింగ్ పూర్తయిందని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు. ఇక, కుమారసంభవం సాయి శ్రీరామ్ చిత్రానికి కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, నృత్యం, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అలాగే చిత్రంలో కథానాయకుడిగా కూడా నటించడం విశేషం. ఈ చిత్రంలో నిఖితా మీనన్, సాయి అక్షిత, మీనాక్షి అనే ముగ్గురు కథానాయికలుగా నటించారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.