• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • FILMMAKER ANURAG KASHYAP QUESTIONED BY MUMBAI POLICE IN RAPE CASE SR

Anurag Kashyap : అత్యాచారం కేసులో బాలీవుడ్ దర్శకున్ని ప్రశ్నించిన పోలీసులు..

Anurag Kashyap : అత్యాచారం కేసులో బాలీవుడ్ దర్శకున్ని ప్రశ్నించిన పోలీసులు..

అనురాగ్ కశ్యప్ Photo : Twitter

Anurag Kashyap : అనురాగ్ కశ్యప్ ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. ఏడేళ్ల క్రితం అనురాగ్, పాయల్ మధ్య జరిగిన ఈ ఘటనపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

  • Share this:
    'ప్రయాణం' 'ఊసరవెల్లి' వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ పాయల్ ఘోష్.. ఇటీవల బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓ సందర్భంలో తనకు కథ చెబుతానని చెప్పిన అనురాగ్ కశ్యప్.. తన గదిలోకి తీసుకెళ్లాడని .. ఆ సమయంలో అనురాగ్‌ కశ్యప్‌ 'బాంబే వెల్‌వెట్‌' సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడని చెప్పింది. అయితే ఆ సినిమాలో నటించాలనుకుంటే తనతో పడక సుఖాన్ని పంచుకోవాలని కోరినట్టు పాయల్ ఆరోపణలు చేసింది. అంతేకాదు తనతో సన్నిహితంగా మెలిగితే భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో ఆఫర్స్ ఇస్తానని చెప్పినట్టు పాయల్ పేర్కొంది. సినిమా ఇండస్ట్రీలో శారీరక సంబంధం కలిగి ఉండటం పెద్ద తప్పేం కాదన్నట్లు చెప్పాడు. తనకు శారీరక సుఖాన్ని అందించాలని కోరుతు తనను తాకాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో తను ఎలాగో అలా తప్పించుకొని వచ్చినట్టు చెప్పింది పాయల్. ఇక ఈ విషయంలో అనురాగ్ పై ఓ కేసు కూడ నమోదు చేసింది. అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని.. రూమ్ లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడని ముంబైలోని వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనురాగ్ కశ్యప్ పై ఐపీసీ సెక్షన్లు 376 (ఐ) (అత్యాచారం) - 354 (మహిళపై దాడి లేదా క్రిమినల్ ఫోర్స్) - 341 మరియు 342 (నిర్బంధం) కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేయబడింది.

    ఈ నేపథ్యంలో అక్టోబర్ 1న ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని పోలీసులు అనురాగ్‌కు సమన్లు జారీ చేశారు.ఈ క్రమంలో అనురాగ్ కశ్యప్ ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. ఈ ఉదయం తన న్యాయవాది ప్రియాంక ఖిమానితో కలిసి వెర్సోవా పోలీస్ స్టేషన్‌‌కు వచ్చిన అనురాగ్ ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. 2013లో తన ఇంట్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాడు.

    ఇక అనురాగ్‌ పై కంప్లైట్ చేసినందకు తనకు వివిధ వ్యక్తులు నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్  వస్తున్నాయని పాయల్ తెలిపింది. ఈ సందర్భంగా తనకు ప్రాణ రక్షణ కల్పించమని.. రీసెంట్‌గా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీని కలిసి తాజా పరిస్థితుల నేపథ్యంలో తనకు వై కేటిగిరీ భద్రతను కల్పించాలని గవర్నర్ ను కోరింది పాయల్. ఇక మరోవైపు అనురాగ్ కశ్యప్ చాలా మంచి వాడని.. కావాలనే పాయల్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని కొందరు హీరోయిన్స్, సినీ ప్రముఖులు అనురాగ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. తాప్సీ ఓ ఇంటర్వూ అనురాగ్ అలాంటీ వాడు కాదని పేర్కోన్న సంగతి తెలిసిందే.
    Published by:Suresh Rachamalla
    First published: