Kandikonda : చావుబ‌తుకుల మ‌ధ్య సినీ గేయ రచయిత కందికొండ... ఆర్థికంగా ఆదుకోవాలంటూ...

Kandikonda Photo : Twitter

Kandikonda : ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కందికొండ గత కొన్ని రోజులుగా త్రోట్ క్యాన్సర్‌తో బాదపడుతున్నారు. దీంతో చికిత్సలో భాగంగా రోజూ రూ.70వేలకుపైగా ఆసుపత్రి ఖర్చులు చెల్లించాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • Share this:
    ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కందికొండ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కందికొండ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జన్మించారు. అనేక ఒడిదొడుకులను దాటి ఉస్మానియా యూనివర్సీటీలో ఉన్నత చదువులను అభ్యసించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను, పండుగల విశిష్టతలను, విశేషాలను తెలియజేసే ఎన్నో పాటలని రాశారు కందికొండ. అంతేకాదు పూరి జగన్నాథ్ దర్శకత్వలో వచ్చిన అల్లు అర్జున్ `దేశముదురు`, మహేష్ బాబు `పోకిరి`, ప్రభాస్ `మున్నా`, రవితేజ `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`, `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి` వంటి ఎన్నో హిట్ చిత్రాలకు పాటలు అందించారు.

    తొలుత కోలుకున్న కందికొండ ఆరోగ్యం ప్రస్తుతం మరింత క్షిణించింది. దీంతో ఆర్థికంగా ఆదుకోవాలనీ ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చికిత్స కోసం లక్షల్లో ఖర్చు అవుతోందని.. దాతలు తమ వంతుగా వచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

    సహాయం చేయాలనుకునేవారు..
    ఈ ఫోన్‌ నంబర్‌కు గూగుల్‌ పే
    చేయొచ్చు: 81793 10687
    బ్యాంక్‌ ఖాతా: ఆంధ్రాబ్యాంక్‌,
    కందికొండ రమాదేవి, అకౌంట్‌
    నంబర్‌: 135510100174728.
    ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ANDB0001355

    ఇక గతంలో కందికొండ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ఆయన ఆస్పత్రి చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు రెండు లక్షల 50 వేల రూపాయల సహాయం అందేలా చూశారు. కందికొండ గత కొన్ని రోజులుగా త్రోట్ క్యాన్సర్‌తో బాదపడుతున్నారు. దీంతో చికిత్సలో భాగంగా రోజూ రూ.70వేలకుపైగా ఆసుపత్రి ఖర్చులు చెల్లించాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: