కోవిడ్ ప్రభావ సమయంలో థియేటర్స్ మూతపడ్డాయి. దాదాపు ఏడు నెలల తర్వాత థియేటర్స్‌ను యాబై శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులను జారీ చేసింది. అందుకు తగిన విధంగా ఆదేశాలను జారీ చేసింది. అయితే ఇప్పుడు సంక్రాంతి పండగ వచ్చింది. యాబై శాతం ఆక్యుపెన్సీతో రన్ చేస్తే థియేటర్స్ రన్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి.. చిత్ర పరిశ్రమ కేంద్రప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటుంది. యాబై శాతం ఉన్న ఆక్యుపెన్సీని వంద శాతంకు పెంచాలని కోరుతోంది. రీసెంట్గా తమిళనాడు ప్రభుత్వం వంద శాతం ఆక్యుపెన్సీకి ఓకే చెప్పినా.. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఆర్డర్స్‌ను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తూ యాబై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌ను ఓపెన్ చేయడానికి ఓకే చెప్పింది.
ఇదే సమయంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అధ్యక్షుడు ఎస్.థాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. యాబై శాతం ఉన్న ఆక్యుపెన్సీని వంద శాతం పెంచాలని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా అనే చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ హోంశాఖ ఈ రిక్వెస్ట్‌కు ఒప్పుకుంటే మాత్రం సినీ ఇండస్ట్రీకి పెద్ద వరాన్ని ఇచ్చినట్లేనని చెప్పాలి.

Film Federation requests Home minister Amit Shah to allow 100% seating capacity
అయితే ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే ముఖ్యమంత్రులను వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇవ్వాలని కోరాయి. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఆదేశాలు ఇవ్వాలని చూసినా, కేంద్ర ప్రభుత్వం అడ్డుచెబుతుందనడంలో సందేహం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ థియేటర్స్ వందశాతం ఆక్యుపెన్సీతో రన్ చేసుకోవచ్చునని ఆదేశాలను జారీ చేసింది. మరి కేంద్ర ప్రభుత్వం.. బెంగాల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.