విశాఖ అమ్మాయిల అందం గురించి త్రివిక్రమ్ ఏమన్నాడో తెలుసా..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా ‘అల వైకుంఠపురములో’.. సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో సక్సెస్ మీట్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసింది చిత్రబృందం.

news18-telugu
Updated: January 20, 2020, 8:18 AM IST
విశాఖ అమ్మాయిల అందం గురించి త్రివిక్రమ్ ఏమన్నాడో తెలుసా..
Twitter
  • Share this:
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ ‘అల వైకుంఠపురములో’.. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన రోజు నుండి అదిరిపోయే టాక్‌తో, రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర విజయాన్ని పురస్కరించుకుని చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ వైజాగ్‌లో నిర్వహించింది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ఎంతో ఆనందం కలిగించిన విషయం ఏమంటే... విలువలతో సినిమా తీయండి. మేమెందుకు ఆదరించమో.. చూపిస్తాం అని మీరంతా చెప్పారు. అది మాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది. మాకే కాదు.. తెలుగు సినిమాకు నమ్మకాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నం గురించి, అక్కడి అమ్మాయిల గురించి మాట్లాడారు. విశాఖపట్నం పేరు చెప్పగానే, తనకు ఇక్కడ ఉండే ఆంధ్రా యూనివర్శిటీతో పాటు, అందమైన అమ్మాయిలు గుర్తుకు వస్తారని త్రివిక్రమ్ అన్నారు. విశాఖ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారని త్రివిక్రమ్ అనగానే అభిమానులు, హాజరైన ప్రజలు కేరింతలు కొట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి బీచ్ తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడే శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రతులను పట్టుకుని రోడ్లపై తిరిగారని తెలిపారు. ఈ నేల చలం, రావిశాస్త్రి, సీతారామశాస్త్రి వంటి ఎందరో మహానుభావులను అందించిందని.. విశాఖ ఎన్నో ఒంపు సొంపులున్న మహానగరమని వైజాగ్ విశిష్టతను తెలిపారు.

చీరలో అదరగొట్టిన భారతీయ అందం ప్రియాంక చోప్రా..

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు