హోమ్ /వార్తలు /సినిమా /

Director Shankar : 16 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించిన కేసులో బుక్కైనా మెగా డైరెక్టర్ శంకర్ అల్లుడు..

Director Shankar : 16 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించిన కేసులో బుక్కైనా మెగా డైరెక్టర్ శంకర్ అల్లుడు..

Shankar son In law Photo : Twitter

Shankar son In law Photo : Twitter

Director Shankar son in law : ప్రముఖ చిత్ర దర్శకుడు శంకర్ అల్లుడు రోహిత్ దామోదరన్‌ లైగింక వేధింపుల కేసులో చిక్కుకున్నారు. ఇదే కేసులో మరో ఐదుగురిపై కూడా కేసు నమోదైంది.

  ప్రముఖ చిత్ర దర్శకుడు శంకర్ అల్లుడు రోహిత్ దామోదరన్‌ (Rohit Damodaran) లైగింక వేధింపుల కేసులో (Shankar son in law booked for sexual harassment of 16 year-old girl) చిక్కుకున్నారు. ఇదే కేసులో మరో ఐదుగురిపై కూడా కేసు నమోదైంది. ఓ 16 ఏళ్ల బాలిక లైంగిక వేధింపుల ఆరోపణలతో మంగళవారం పుదుచ్చేరిలో రోహిత్ దామోదరన్‌‌ (Rohit Damodaran)పై కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది. పదహారేళ్ల బాలికను లైగింకంగా వేధించినందుకు మొత్తం ఐదుగురిని పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) కింద బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రోహిత్ దామోదరన్ విషయానికి వస్తే.. ఈ ఏడాది జూన్‌లో మెగా డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. అతను ఓ తమిళ క్రికెట్ క్లబ్‌కు కెప్టెన్‌గా కూడా చేస్తున్నారు.

  గతంలో ఈ అమ్మాయి క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లినప్పుడు తనను లైంగికంగా వేధించారని తన ఫిర్యాదులో ఆరోపించింది. అంతేకాదు ఒకవేళ ఇదే విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని తెలిపింది. ఇక దర్శకుడు శంకర్ విషయానికి వస్తే.. రోబో, 2.0, జెంటిల్‌మన్, బాయ్స్, భారతీయుడు వంటి సినిమాలతో చాలా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తెలుగులో (Ram Charan) రామ్ చరణ్‌తో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో వస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించనుంది. కియారా అద్వానీ గతంలో రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామలో నటించి తన అందచందాలతో అదరగొట్టింది.

  Allu Sneha Reddy : ప్రియమైనవాడితో అల్లు స్నేహా రెడ్డి.. వైరల్ అవుతోన్న రొమాంటిక్ వీడియో..

  ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పేరొందిన ఆర్టిస్ట్‌లు నటించబోతున్నారట. ఇక ఈ సినిమా గురించి మరో క్రేజీ వార్త ఏమంటే.. శంకర్‌ రామ్‌ చరణ్‌ మూవీలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా నటించనున్నట్లు టాక్. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు.

  Love Story: కష్టకాలంలో మహేష్ బాబుకు అండగా నిలిచిన నాగ చైతన్య..

  ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ (RRR) సినిమా విషయానికి వస్తే.. రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా ఆలియా భట్, ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Ram Charan, Shankar, Tollywood news

  ఉత్తమ కథలు