జూనియర్ ఎన్టీఆర్‌‌ను టార్గెట్ చేసిన వర్మ.. మండిపడుతోన్న టీడీపీ వర్గాలు..

తారక్, వర్మ Photo: Twitter

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. జగన్ సునామీ ముందు తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. అయితే దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

  • Share this:
    ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. జగన్ సునామీ ముందు తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. కేవలం 23 చోట్ల మాత్రమే విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఇప్పుడు టీడీపీ భవితవ్యం గురించి చాలా చర్చలే నడుస్తున్నాయి. ఇక  వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించగల సత్తా ఎవరికి ఉందంటూ విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. అయితే ఎన్నికల సమయంలో టీడీపీ, చంద్రబాబు ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. ఇప్పుడున్న పరిస్థితితుల్లో టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ స్వీకరిస్తే ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం పాలైన విషయాన్ని అందరూ మర్చిపోతారని ట్వీట్ చేశారు. అంతేకాదు తారక్‌కు తన తాతగారిపై ఏమైనా అభిమానం ఉంటే వెంటనే టీడీపీని రక్షించే బాధ్యతలను తన భుజాలపై వేసుకోవాలని వర్మ సూచించారు.    మునిగిపోతున్న టీడీపీని రక్షించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది తారక్ ఒక్కరేనని వర్మ అభిప్రాయపడ్డారు.ఇటీవల జరిగిన ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ ఘాట్‌కు విచ్చేసిన జూనియర్‌ను ఉద్దేశించి అభిమానులు టీడీపీ నాయకుడిగా భాద్యతలు చేపట్టాలంటూ తమ నినాదాల ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే తారక్ ఈ దిశగా అడుగులు వేస్తాడా లేదా అనేది ఇంకా తెలియాల్సివుంది. ఏదేమైనా తారక్ టీడీపీని బలోపేతం చెయ్యగలిగే నాయకుడంటూ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయ పడుతున్నారు. అయితే వర్మ వ్యాఖ్యలపై టీటీపీలోని కొందరు స్వాగతిస్తుంటే..మరికొందరు మండిపడుతున్నారు.

    First published: