హోమ్ /వార్తలు /సినిమా /

RGV: ఈ ఆర్జీవీకి ఏం పనిలేనట్లుంది.. అక్కడ కూడా వేలు పెట్టాడు.. 

RGV: ఈ ఆర్జీవీకి ఏం పనిలేనట్లుంది.. అక్కడ కూడా వేలు పెట్టాడు.. 

Ram Gopal Varma/ Photo Twitter

Ram Gopal Varma/ Photo Twitter

రామ్​గోపాల్​ వర్మ. బాగా తెలిసిన పేరే. ఒకప్పుడు బాగా వెలిగిన దర్శకుడు. ఇపుడు సినిమాలకన్నా వివాదాల ద్వారానే మీడియాలో కనిపిస్తున్నారు. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు వర్మ.

రామ్​గోపాల్​ వర్మ (Film director Ram Gopal Varma ). బాగా తెలిసిన పేరే. ఒకప్పుడు బాగా వెలిగిన దర్శకుడు. ఇపుడు సినిమాలకన్నా వివాదాల ద్వారానే మీడియాలో కనిపిస్తున్నారు. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు వర్మ. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము (NDA presidential candidate Draupadi Murmu) పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాంగోపాల్ వర్మ (RGV). దీంతో ఆయనపై బీజేపీ నాయకులు శుక్రవారం హైదరాబాద్​లోని (Hyderabad) అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, సీనియర్ బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి లు ఫిర్యాదు చేశారు. ఏన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మును ప్రకటించిన సందర్భంగా 'ద్రౌపది రాష్ట్రపతి ' అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు ఎవరంటూ కామెంట్ చేశారని, ఇవి ఆమె మనోభావాలు దెబ్బతినేలా ఉన్నందున ఎస్సీ (SC), ఎస్టీ (ST) అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో కోరారు. రాంగోపాల్ వర్మపై బీజేపీ (BJP) నాయకులు ఫిర్యాదు చేశారని, . అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం కేసు నమోదు చేస్తామని అబిడ్స్ (Abids) ఇన్ స్పెక్టర్ ప్రసాదరావు తెలిపారు.

అయితే ద్రౌపది ముర్ముపై ట్వీట్ విషయంలో రామ్​గోపాల్​ వర్మపై విమర్శలు రావడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇది కేవలం వ్యంగ్యంతో చెప్పానని ఆర్జీవీ తెలిపారు. వేరే విధంగా ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. మహాభారతంలోని ద్రౌపది నాకు చాలా ఇష్టమైన పాత్ర, అలాంటి పేరు చాలా అరుదు కాబట్టి కొన్ని సంబంధిత పాత్రలు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కాదని వివరణ ఇచ్చారు ఆర్జీవీ (RGV).

వివాదాలకు కేరాఫ్​..

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal varma).. ఈ డైరెక్టర్ ఏం చేసినా వివాదమే. సమకాలీన అంశాల ఆధారంగా సినిమాలు తీస్తూ క్యాష్ చేసుకుంటారు. నేరాలు, ఘోరాలు, శృంగారం, రాజకీయాలు.. ఇటీవల వీటిపైనే ఎక్కువ మూవీలు తీస్తుంటారు ఆర్జీవీ. కేవలం సినిమాలే కాదు.. అప్పుడప్పుడు సామాజిక అంశాలు, రాజకీయాలపైనా తన దైన శైలిలో స్పందిస్తుంటారు ఆర్జీవీ. ఇటీవల కూడా ఆయన ఓ ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ఆ ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో (Telangana politics) చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అది ఓ మంత్రిని టార్గెట్ చేస్తూ.. వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది.

సినిమా షూటింగ్ ఆపలేరని..

ప్రస్తుతం కొండా మురళి (Konda Murali), కొండా సురేఖ (Konda Surekha) ప్రేమాయణంతో పాటు రాజకీయ జీవితంపై బయోపిక్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాకు “కొండా” అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఇటీవలే కొండా సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం వరంగల్‌లో పర్యటించింది. ఐతే ఈ సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. “అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరని ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టే, పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని నల్ల బల్లి సుధాకర్ తెలుసుకోవాలి…జై తెలంగాణ” అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు వర్మ. ఆర్జీవీ చేసిన ఆ ట్వీట్‌లో నల్లబల్లి సుధాకర్… ఎవరు అనే దానిపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.

ఐతే ఆయన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar rao) కే వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొండా సినిమాను నిలిపివేయాల్సిందిగా.. ఎర్రబెల్లి దయాకర్ రావు నుంచి రామ్ గోపాల్ వర్మకు బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ నల్లబల్లి సుధాకర్ అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Case filed, President Elections 2022, Ramgopal varma, RGV, Telugu movies, Tweets

ఉత్తమ కథలు