Kathi Mahesh accident: సినీ నటుడు కత్తి మహేష్ ఆరోగ్యం విషమం.. తలకు తీవ్రమైన గాయాలు..

కత్తి మహేష్ (Kathi Mahesh)

Kathi Mahesh accident: ప్రముఖ క్రిటిక్, కాంట్రవర్సీలతో ఎప్పుడూ వార్తల్లోనే ఉండే సినీ నటుడు కత్తి మహేష్(Kathi Mahesh accident) దారుణమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఈయన నెల్లూరులోని ఓ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

  • Share this:
ప్రముఖ క్రిటిక్, కాంట్రవర్సీలతో ఎప్పుడూ వార్తల్లోనే ఉండే కత్తి మహేష్ దారుణమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఈయన నెల్లూరులోని ఓ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. చెన్నై, కలకత్తా రహదారిపై జూన్ 26 తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని నెల్లూరులోని మెడికవర్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే ఆయనకు ఇప్పుడు మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు వైద్యులు. ఈ ప్రమాదంలో మహేష్ తలకు తీవ్ర గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ ఇసోలేషన్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మహేష్ ఆరోగ్య పరిస్థితి గురించే ఇప్పుడే ఏం చెప్పలేమంటున్నారు. ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని హాస్పిటల్ వైద్యులు చెప్తున్నారు. మరికొన్ని గంటల తర్వాత కానీ హెల్త్ బులిటెన్ విడుదల చేయలేమని.. అప్పటి వరకు మానిటర్ చేస్తున్నామని తెలిపారు మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం. ప్రమాద సమయంలో మహేష్ కత్తితో పాటు డ్రైవర్ ఉన్నట్లు తెలుస్తుంది.
kathi mahesh,kathi mahesh car accident,kathi mahesh accident,kathi mahesh condition critical,film critic kathi mahesh health condition,telugu cinema,కత్తి మహేష్,కత్తి మహేష్ ఆరోగ్యం విషమం
కత్తి మహేష్ (Kathi Mahesh)

డ్రైవర్ ఇచ్చిన సమాచారంతోనే కత్తి మహేష్‌గా పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే హుటాహుటిన మెడికవర్ హాస్పిటల్‌కు తరించారు. కొద్దిసేపటి క్రితం మెడికవర్ హాస్పిటల్‌కు చేరుకున్న కత్తి మహేష్ స్నేహితులు, బంధువులు చేరుకున్నారు. అక్కడే ఆయన ఆరోగ్యం గురించి వాళ్ళు ఆరా తీస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: