FILM CHAMBER AND FEDERATION MEETING ON CINE WORKERS STRIKE SLB
టాలీవుడ్లో ముగిసిన సంక్షోభం... సినీ కార్మికుల డిమాండ్ ఇదే.. నిర్మాతల మాట ఏంటంటే?
Photo Twitter
Tollywood Cine Workers Strike: గత రెండ్రోజులుగా టాలీవుడ్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.తమకు వేతనాలు పెంచాలంటూ సినీ కార్మితకులందరూ కూడా ఒక్కసారిగా సమ్మెకు దిగారు. దీంతో నిర్మాతలు తలలు పట్టుకున్నారు. ఇలా సడెన్‌గా సమ్మె అంటే అందరూ ఇబ్బంది పడతారు.. అవుట్ డోర్ షూటింగ్లో ఉన్న వాళ్లకు కష్టం అవుతుందంటూ నిర్మాతలు వాపోయారు. ఇదే విషయంలో సీ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్లో సినీ కార్మికులను, నాయకులకు హితవు పలికారు.
గత రెండ్రోజులుగా టాలీవుడ్లో (Tollywood Strike) గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.తమకు వేతనాలు పెంచాలంటూ సినీ కార్మితకులందరూ కూడా ఒక్కసారిగా సమ్మెకు దిగారు. దీంతో నిర్మాతలు తలలు పట్టుకున్నారు. ఇలా సడెన్‌గా సమ్మె అంటే అందరూ ఇబ్బంది పడతారు.. అవుట్ డోర్ షూటింగ్లో ఉన్న వాళ్లకు కష్టం అవుతుందంటూ నిర్మాతలు వాపోయారు. ఇదే విషయంలో సీ కళ్యాణ్ (C Kalyan) నిన్న ప్రెస్ మీట్లో సినీ కార్మికులను, నాయకులకు హితవు పలికారు వేతనాలు పెంచేందుకు మాకు సమ్మతమే, కానీ అడిగే విధానం ఇది కాదంటూ చెప్పుకొచ్చారు. వెంటనే షూటింగ్‌లు జరగాలి, అందరూ పనుల్లోకి రావాలి.. అప్పుడే చర్చిస్తామంటూ నిన్నటి ప్రెస్ మీట్లో సీ కళ్యాణ్ మాట్లాడారు. అయితే మొత్తానికి ఫెడరేషన్, ఫిలిం చాంబర్ (Film Chamber) కలిసి ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించారు.
ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. సినీ కార్మికుల వేతనాలు పెంచడానికి నిర్మాతల మండలి అంగీకారం తెలిపింది. రేపటి నుంచి యధావిధిగా సినిమా షూటింగ్‌లు జరుగుతాయని తెలుస్తోంది. అయితే వేతనం ఎంత శాతం పెంచాలన్న దానిపై సమన్వయ కమిటీ భేటీ లో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
10 శాతం పెంచేందుకు నిర్మాతలు సుముఖంగా ఉంటే.. కనీసం 30 పర్సెంట్ అయిన పెంచాలి అని ఫెడరేషన్ తరుపున వాదనలు బలంగా వినిపించారు. మరి రేపు జరిగే సమన్వయ కమిటీ భేటిలో ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి. ఈ సమన్వయ కమిటీ చైర్మన్‌గా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. ప్రతీ మూడేళ్లకు ఒకసారి సినీ కార్మికుల వేతనాలు పెంచడమన్నది ఆనవాయితీగా వస్తోంది.
2018లో వేతనాలు పెంచారు. ప్రతీ సారి ముప్పై శాతం వేతనాలు పెంచుతుంటారు. అయితే 2021లో కరోనా కారణంగా వేతనాలు పెంచలేదు. దీనిపై ఫెడరేషన్ ఎన్నో సార్లు తమ బాధలను విన్నవించుకుంది. ఫిలిం చాంబర్ సైతం వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఇంత వరకు అది నెరవేరలేదు. దీంతో 24 క్రాఫ్ట్స్‌కు చెందిన కార్మికులంతా కూడా బుధవారం నాడు సమ్మెకు దిగారు.
దీంతో టాలీవుడ్ మొత్తంగా స్తంభించిపోయింది. అలా సడెన్‌గా సమ్మెకు దిగడం కరెక్ట్ కాదని, వెంటనే సమ్మెను విరమించుకోవాలంటూ కార్మికులకు సీ కళ్యాణ్ సూచించిన సంగతి తెలిసింది. అయితే ఇక రేపటి మీటింగ్‌లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. కార్మికులు కోరుకున్న ముప్పై శాతం పెంచుతారా? లేదా? అన్నది చూడాలి.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.