కోజికోడ్ ఎయిర్ క్రాష్ పై మహేష్, బన్ని సహా ప్రముఖుల స్పందన..

కేరళ‌లో కోజికోడ్‌లో నిన్న రాత్రి జరిగిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందారు. ఈ విమాన ప్రమాద ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు.

news18-telugu
Updated: August 8, 2020, 1:01 PM IST
కోజికోడ్ ఎయిర్ క్రాష్ పై మహేష్, బన్ని సహా ప్రముఖుల స్పందన..
అల్లు అర్జున్, మహేష్ Photo : Twitter
  • Share this:
కేరళ‌లో కోజికోడ్‌లో నిన్న రాత్రి జరిగిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందారు. మరో 121 మంది గాయపడ్డారు.క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమం ఉంది. దుబాయ్ నుంచి కోజికోడ్‌‌కు వచ్చిన విమానం కరిపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపు తప్పడంతో విమానం రెండు ముక్కలయ్యింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు సినీ, రాజకీయ, క్రీడ ప్రముఖుల సంతాపం వ్యక్తం చేసారు. కోజికోడ్ విమానశ్రమంలో జరిగిన ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు మహేష్ బాబు సంతాపం వ్యక్తం చేసారు. అటు తమిళ హీరో కమల్ హాసన్ కూడా చనిపోయిన వారి కుటుంబాలకు, వారి బంధు మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ప్రమాద ఘటన జరిగిన తర్వాత స్పందించిన విమానాశ్రయ సిబ్బందికి, స్థానికులకు నమస్కారాలు తెలియజేసారు. ఈ విషాద సమయంలో కేరళ వైద్యులకు మరింత ధైర్యం ప్రసాదించాలని కోరుతున్నారు.





కేరళలో జరిగిన విమాన ప్రమాదంపై అల్లు అర్జున్ స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరకుంటున్నాను. అంతేకాదు చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని కోరారు.

మరోవైపు ఈ ప్రమాదంపై మంచు విష్ణు స్పందించారు. నిద్ర లేచిన వెంటనే కేరళలో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలుసుకొని షాక్‌కు గురయ్యాను. చనిపోయిన వారి కుటుంబాలకు సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 
అంతేకాదు ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా అంటూ మంచు విష్ణు తెలిపారు. వీళ్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ ఘటనపై స్పందించారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 8, 2020, 1:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading