హోమ్ /వార్తలు /సినిమా /

Saaho: సాహో అట్టర్ ఫ్లాప్...తరన్ ఆదర్శ్ సంచలన రివ్యూ

Saaho: సాహో అట్టర్ ఫ్లాప్...తరన్ ఆదర్శ్ సంచలన రివ్యూ

ప్రభాస్ ‘సాహో’

ప్రభాస్ ‘సాహో’

Saaho review: తరన్ ఆదర్శ్ మూవీపై ప్రభాస్ అభిమానులు భగ్గమంటున్నారు. తెలుగు ఇండస్ట్రీ, ప్రభాస్ ఎదుగుదలను ఓర్వలేకే చెత్త రివ్యూలు చేస్తున్నారంటూ మండిపడతున్నారు.

  భారీ అంచనాలతో విడుదలైన సాహో మూవీపై మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. సినిమా అద్భుతంగా ఉందని కొందరు చెబుతున్నారు. హాలీవుడ్ స్థాయిలో ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం మూవీ ఆశించిన స్థాయిలో లేదని పెదవి విరుస్తున్నారు. యాక్షన్ సీన్స్ తప్ప సినిమాలో ఏమీ లేదని నిరుత్సాహానికి గురవుతున్నారు. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. థియేటర్ల దగ్గర కటౌట్లు, పాలభిషేకాలు, రక్త తిలకాలతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ విమర్శకుడు తరన్ ఆదర్శ్ సాహో మూవీపై వ్యాఖ్యలు చేశారు. సాహో సినిమాను భరించలేమని ట్విటర్‌లో తన రివ్యూను రాసుకొచ్చారు. కేవలం 1.5 రేటింగ్ మాత్రమే ఇవ్వడం బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

  సాహో మూవీని భరించలేము. ట్యాలెంట్‌ని, మంచి అవకాశాన్ని, భారీ మొత్తంలో డబ్బును వృథా చేశారు. కథ బలహీనంగా ఉంది. స్క్రీన్ ప్లే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది.
  తరన్ ఆదర్శ్

  తరన్ ఆదర్శ్ మూవీపై ప్రభాస్ అభిమానులు భగ్గమంటున్నారు. తెలుగు ఇండస్ట్రీ, ప్రభాస్ ఎదుగుదలను ఓర్వలేకే చెత్త రివ్యూలు చేస్తున్నారంటూ మండిపడతున్నారు. దక్షిణాది చిత్రాలపై పనిగట్టుకొని ఆక్రోశాన్ని వెల్లగక్కుతున్నారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, తరన్ ఆదర్శ్‌కు మంచి సిని విశ్లేషకుడిగా పేరుంది. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక అక్టోబరులో విడుదలకానున్న 'సైరా నరసింహారెడ్డి' మూవీపై తరణ్ ఆదర్శ్ ఎలాంటి రివ్యూ ఇస్తారోనని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Prabhas, Prabhas saaho, Saaho, Saaho movie, Saaho Movie Review, Saaho public talk, Saaho tickets, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు