కరోనా నేపథ్యంలో ఫైటర్ షూటింగ్ ప్లాన్ మార్చిన పూరి..

విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తున్న చిత్రం ఫైటర్.

news18-telugu
Updated: April 25, 2020, 2:24 PM IST
కరోనా నేపథ్యంలో ఫైటర్ షూటింగ్ ప్లాన్ మార్చిన పూరి..
పూరి జగన్నాధ్ Photo : Twitter
  • Share this:
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తున్న చిత్రం ఫైటర్. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమేకాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఫైటర్‌లో విజయ్‌కు జోడిగా హిందీ భామ అనన్య పాండే నటిస్తోంది. ముంబైలో 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా తర్వాత షెడ్యూల్ ముంబైలోని ధారవిలో జరగాల్సీవుంది. కానీ కరోనా కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్ వల్ల అక్కడ ప్రస్తుతం షూటింగ్ జరిగే ప్రసక్తే లేదు. దీంతో ఆ ప్రణాళికను చిత్రబృందం మార్చుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న నగరాలలో ముంబై ఒకటి. లాక్ డౌన్ ముగిసినప్పటికీ అక్కడ షూటింగ్ చేయడం శ్రేయస్కరం కాదని పూరి భావిస్తుందట చిత్రబృందం. అందుకే ఫైటర్ సినిమా నిర్మాతలు ఇక్కడే హైదరాబాద్ లోనే ప్రత్యేకమైన సెట్స్ లో మూవీని పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: April 25, 2020, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading