పూరీ జగన్నాథ్ కెరీర్‌లో అదే బెస్ట్ ఫిల్మ్ అట.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్..

పూరీ జగన్నాథ్.. బద్రి సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన పూరీ జగన్నాథ్.. మధ్యలో దర్శకుడిగా కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నాడు.దాదాపు 40 సినిమాలకు చేరువలో ఉన్న పూరీ జగన్నాథ్ కెరీర్‌లో అదే బెస్ట్ ఫిల్మ్ అని చెబుతున్నారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: June 24, 2020, 11:42 AM IST
పూరీ జగన్నాథ్ కెరీర్‌లో అదే బెస్ట్ ఫిల్మ్ అట.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్..
పూరి జగన్నాధ్ Photo : Twitter
  • Share this:
పూరీ జగన్నాథ్.. బద్రి సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన పూరీ జగన్నాథ్.. మధ్యలో దర్శకుడిగా కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నాడు. ఇక దర్శకుడిగా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ‘ఇడియట్’ సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన ‘పోకిరి’ సినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.ఈ సినిమా తెలుగులో ఎక్కువ కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రంగా అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. ఒక వైపు హిట్ సినిమాలతో పాటు ఫ్లాపు సినిమాలు కూడా పూరీ జగన్నాథ్ కెరీర్‌లో ఉన్నాయి. ఇక ఎన్టీఆర్‌తో చేసిన ’టెంపర్’  సినిమా తర్వాత సరైన  సక్సెస్ లేని పూరీ జగన్నాథ్‌కు గతేడాది  రామ్‌తో తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

‘ఇస్మార్ట్ శంకర్’తో పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ (Twitter/Photo)


ఇస్మార్ట్ శంకర్ గొప్ప కథేం కాదు.. మామూలు రెగ్యులర్ మాస్ మసాలా సినిమా అంతే. ఈ టైమ్‌లో సినిమాలేం లేవు కాబట్టి బ్లాక్ బస్టర్ అయింది అనుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. మాస్ సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది కాబట్టి అదే శంకర్‌కు కలిసొచ్చింది. ఇప్పుడు ఈ హిట్‌తో బ్లాక్‌బస్టర్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చినా కూడా పూరీకి ఒరిగింది మాత్రం లేదు. పూరీ జగన్నాథ్ మాత్రం మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణలతో సినిమాలు చేస్తా అని చెబుతున్నాడు. రీసెంట్‌గా పూరీ జగన్నాథ్.. మరోసారి తన మనసులో  మాట బయటపెట్టాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ సినిమాను తెరకెక్కించడమే అని చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోవడమే తన డ్రీమ్ అంటున్నాడు.అప్పట్లో మహేష్ బాబుతో ‘పోకిరి’, ‘బిజినెస్ మేన్’ సినిమాల తర్వాత ముచ్చటగా మూడో సినిమా ‘జనగణమన’ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు. అప్పట్లో పూరీ జగన్నాథ్.. కూడా ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసాడు. కానీ మహేష్ బాబుకు మాత్రం ఈ సినిమా స్క్రిప్ట్ పై పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయలేదు. దీంతో పూరీ జగన్నాథ్.. మహేష్ బాబుతో ‘జనగణమన’  పాడించలేకపోయాడు.

పూరీ జగన్నాథ్ మహేష్ బాబు (Mahesh Babu Puri jagannadh)
పూరీ జగన్నాథ్ మహేష్ బాబు (Mahesh Babu Puri jagannadh)


తాజాగా పూరీ జగన్నాథ్ మరో ట్వీట్ చేస్తూ.. తన కెరీర్‌లో ‘ఫైటర్’ సినిమానే అత్యుత్తమ సినిమా అని చెప్పడం విశేషం. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఫైటర్ సినిమా మరో లెవల్లో ఉంటుందని తన ట్వీట్‌లో తెలియజేసాడు.

పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంతో అనన్యా పాండే హీరోయిన్‌గా టాలీవుడ్‌‌కు పరిచయం అవుతుంది. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
First published: June 24, 2020, 11:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading