అదేంటి.. అనసూయ, రష్మి గొడవ పడటం ఏంటి అనుకుంటున్నారా..? నిజానికి ఈ ఇద్దరి మధ్య ఏవో గొడవలు ఉన్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే అదంతా ట్రాష్ అంటూ ఇద్దరూ కొట్టి పడేసారు. ఇద్దరం చాలా మంచి స్నేహితులం అంటూ చెప్పారు రష్మి, అనసూయ. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్స్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం సుమ కనకాల అని వస్తుంది. ఆమె తర్వాత స్థానంలో అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ ఉంటారు. జబర్దస్త్ అనే షోతోనే ఈ ఇద్దరూ పాపులర్ అయ్యారు. నిజానికి రష్మి, అనసూయ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ దాదాపు ఒకేసారి కెరీర్ మొదలు పెట్టారు. పైగా మొదట్లో సినిమాల్లోనే చిన్న చిన్న పాత్రలు చేసారు. గుర్తు కూడా పట్టలేని పాత్రల్లో నటించారు అనసూయ, రష్మి గౌతమ్. ఆ తర్వాత యాంకర్స్‌గా ప్రస్థానం మొదలు పెట్టారు. యాదృశ్చికంగా ఇద్దరికీ జబర్దస్త్ కామెడీ షో బ్రేక్ ఇచ్చింది. ఆ షోతోనే పాపులర్ అయ్యారు. స్టార్ యాంకర్స్‌గా మారారు. ఒక్కో షోకు లక్షలకు లక్షలు తీసుకుంటూ టాప్ రేంజ్‌కు ఎదిగిపోయారు. అనసూయ అయితే సినిమాల్లో కూడా తనదైన శైలిలో దూసుకుపోతుంది.
ఇలాంటి ఈ ఇద్దరు యాంకర్స్ ఇప్పుడు స్టేజీ ముందు అందరూ చూస్తుండగానే గొడవ పడ్డారు. ఈటీవీ న్యూ ఇయర్ వేడుక సందర్భంగా డిజే అనే కార్యక్రమం చేస్తుంది. అందులో అనసూయ, రష్మి గౌతమ్ కూడా పాల్గొన్నారు. వాళ్లిద్దరూ స్టేజీపైకి రాగానే ఒకరిపై ఒకరు పంచులు వేసుకున్నారు. రష్మి స్టేజీ మర్యాదగా ఇస్తే మంచిది అంటూ అనసూయ వార్నింగ్ ఇచ్చింది.. ఇవ్వకపోతే ఏంటి అని అడిగితే లాగేసుకుంటా అని సమాధానమిచ్చింది అనసూయ.
ఇదేమైనా యాంకరింగ్ కుర్చీనా లాక్కోడానికి అంటూ పంచ్ వేసింది రష్మి. ముందు నువ్వే లాక్కున్నావ్ అంటూ ఇద్దరూ మాట మాట అనేసుకున్నారు. ఇదంతా నిజంగా జరగలేదు.. కేవలం స్కిట్ కోసమే చేసారు. ఎప్పుడూ ఒకరి కుర్చీ ఒకరు లాగేసుకున్నారు అంటూ సాగే చర్చను పాయింట్‌గా తీసుకుని ఈ స్కిట్ రాసారు. రష్మి, అనసూయ మధ్యలో సుడిగాలి సుధీర్ కూడా నలిగిపోయాడు. ఏదేమైనా ఈ డిజే ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Anchor rashmi gautam, MLA Roja, Telugu Cinema, Tollywood