వచ్చిండే.. మెల్లమెల్లగా వచ్చిండే.. ఈ పాట తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో..? ‘ఫిదా’ సినిమాలోని ఈ పాటకు అంతా ఫిదా అయిపోయారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీకి తోడు సాయిపల్లవి డాన్సులకు నిజంగానే అంతా ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఈ పాట మరో సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డుల మోత మోగించింది ఈ పాట. శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో సూపర్ హిట్ అయింది. ఈ పాటను తెలంగాణ గాయని మధుప్రియ పాడింది.
ఇక ఇందులో మరీ ప్రత్యేకంగా వచ్చిండే పాట అయితే సంచలనమే. ఎక్కడ చూసినా కూడా ఇదే పాట వినిపించింది. 2017 మొత్తం ఈ పాటతోనే మార్మోగిపోయింది టాలీవుడ్. సినిమా వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా కూడా ఇప్పటికీ ఫిదా సంచలనాలు ఆగడం లేదు. తాజాగా ఈ పాట అద్భుతమైన రికార్డ్ అందుకుంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 173 మిలియన్ వ్యూస్ అందుకుని యూ ట్యూబ్‌లో సరికొత్త సంచలనాలకు తెరతీసింది ‘ఫిదా’ వచ్చిండే పాట. ఇంత వేగంగా హైయ్యస్ట్ వ్యూస్ అందుకున్న పాట ఇదే.
సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ పాటకు కూడా ఈ స్థాయి వ్యూస్ రాలేదు. ఇప్పటికీ వచ్చిండే పాటకు వ్యూస్ వస్తూనే ఉన్నాయి. సాయిపల్లవి డాన్సులకు తోడు ఆ బీట్ కూడా అలాగే ఉండటంతో ఆరు నుంచి అరవై వరకు అంతా ఆ పాటకు నిజంగానే ఫిదా అయిపోయారు. వరుణ్ తేజ్ కెరీర్లో కూడా ‘ఫిదా’ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. జులై 21, 2017న విడుదలైన ‘ఫిదా’ 48 కోట్లు షేర్ వసూలు చేసింది. మొత్తానికి చూడాలిక.. ఇదే ఊపులో 200 మిలియన్స్‌కు కూడా ‘ఫిదా’ పాట చేరుకుంటుందేమో..?
అమైరా దస్తూర్ ఫోటోషూట్..
ఇవి కూడా చదవండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Pallavi, Telugu Cinema, Tollywood, Varun Tej, Youtube