Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 11, 2020, 6:43 PM IST
చిరంజీవి,సాయి పల్లవి (Chiranjeevi Sai Pallavi/Photo)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈయన కొరటాల దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. త్వరలోనే మళ్లీ సెట్లో అడుగు పెట్టనున్నాడు చిరు. నవంబర్ నుంచి ఆచార్యతో బిజీ కానున్నాడని తెలుస్తుంది. దీనికోసం ఇప్పటికే డేట్స్ కూడా కేటాయించాడు ఈయన. మరో 50 శాతానికి పైగానే ఆచార్య షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఆచార్య విడుదల కానుంది. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్గా నటించబోతుంది. రామ్ చరణ్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఈయనకు జోడీగా రష్మిక మందన్న కనిపించబోతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత మెహర్ రమేష్, వినాయక్ దర్శకత్వంలో వరస సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు పూర్తైన తర్వాత బాబీ, త్రివిక్రమ్, హరీష్ శంకర్ లాంటి దర్శకులు కూడా లైన్లోనే ఉన్నారు. వేదాళం రీమేక్‌లో చిరు హీరోగా నటించబోతున్నాడు.

చిరంజీవి అజిత్ (chiranjeevi ajith)
ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించబోతున్నాడు. ఇందులో కీలకమైన చెల్లి పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. వేదాళంలో అజిత్ హీరోగా నటిస్తే.. అతడి చెల్లిలి పాత్రలో లక్ష్మీ మీనన్ నటించింది. ఈ సినిమాలో చెల్లెలి పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. హీరోయిన్‌కు తక్కువగా ఉంటుంది.. అందులో శృతి హాసన్ హీరోయిన్గా నటించినా కూడా ఆమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. లక్ష్మీ మీనన్ కథకు కీలకం. అలాంటి పాత్రలో సాయి పల్లవి నటించబోతుంది.

చిరంజీవి,సాయి పల్లవి (Chiranjeevi Sai Pallavi/Photo)
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించబోతున్నాడు. ఏదేమైనా కూడా చిరంజీవి చెల్లిగా నటించడం అంటే చిన్న విషయం కాదు.. అయితే స్టార్ హీరోయిన్గా ఉన్న సమయంలోనే చెల్లి పాత్రల్లో నటించాలనుకోవడం కూడా నిజంగానే సాహసం. మరి ఈ సినిమా తర్వాత సాయి పల్లవి కెరీర్ ఎలా ఉండబోతుందో..?
Published by:
Praveen Kumar Vadla
First published:
October 11, 2020, 6:43 PM IST