Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 24, 2020, 4:24 PM IST
సాయి పల్లవి (Sai Pallavi)
ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఫిదా సినిమాతో ఈమె హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా ఎంసిఏ, పడిపడి లేచే మనసు లాంటి సినిమాలతో ఇక్కడ స్టార్ అయిపోయింది. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా సాయి పల్లవి కెరీర్ సాగుతుందిప్పుడు. ప్రస్తుతం ఈమె తెలుగులో విరాట పర్వం సినిమాతో పాటు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా చివరి దశకు వచ్చేసాయి. ఒకేసారి రెండు సినిమాలు విడుదల కానున్నాయి కూడా. ఇదిలా ఉంటే సాయి పల్లవి చూపించిన ఓ టాలెంట్ చూసి అంతా ఫిదా అయిపోయారు. ఈమె ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ కోసం ఉత్తరప్రదేశ్ పిప్రీలో ఉంది. అక్కడ షూటింగ్ సమయంలో బిజీగా ఉంటూనే.. ఖాళీ సమయాల్లో మాత్రం తన టాలెంట్ చూపించింది. కార్ వ్యాన్‌కు పరిమితం కాకుండా అక్కడున్న పిల్లలతో సరదాగా గడిపింది సాయి పల్లవి.
దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. అంతేకాదు అక్కడున్న పిల్లలతో ఆడుకోవడమే కాదు.. వాళ్ల చేతులను అందంగా మెహందీతో అలంకరించింది. ఆ పిల్లల ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసిన సాయి పల్లవి.. దానికి 'హ్యాపీ క్లైంట్స్, పిప్రీ పిల్లాస్' అంటూ హార్ట్ ఎమోజీ యాడ్ చేసింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లే కాదు.. సెలబ్రిటీస్ కూడా ఫిదా అయిపోతున్నారు. ఎందుకంటే అంత అందంగా మెహందీ అలంకరించింది కాబట్టి. అందుకే సమంత అక్కినేని, అనుపమ పరమేశ్వరన్, నీరజ కోన, కీర్తి సురేష్ లాంటి వాళ్లు కూడా సాయి పల్లవి కొత్త టాలెంట్‌ను అభినందిస్తున్నారు.
Published by:
Praveen Kumar Vadla
First published:
October 24, 2020, 4:24 PM IST