Home /News /movies /

FIDAA BEAUTY SAI PALLAVI SAYS SHE FALL IN LOVE WITH VARUN TEJ TYPE OF BOY PK

వరుణ్ తేజ్‌కు సాయి పల్లవి ఫిదా.. అలాంటోడితోనే పెళ్లి..

వరుణ్ తేజ్,సాయి పల్లవి (File Photos)

వరుణ్ తేజ్,సాయి పల్లవి (File Photos)

Sai Pallavi: తన లైఫ్ గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాల గురించి చెప్పుకొచ్చింది ఈ ఫిదా బ్యూటీ. అసలెప్పుడు ఎక్కడా చెప్పని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది ఈమె.

ఎప్పుడూ సినిమాలతోనే కాకుండా అప్పుడప్పుడూ పర్సనల్ లైఫ్‌ను కూడా కాస్త పట్టించుకోవాలి. పైగా ఇప్పుడు లాక్ డౌన్.. ఇప్పుడు పర్సనల్ తప్ప ప్రొఫెషనల్ అంటూ ఉండదు. స్టార్స్ అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. ఇదే సమయంలో సాయి పల్లవి కూడా ఇంట్లోనే లాక్ అయిపోయింది. ఈ సందర్భంగా అభిమానులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. తన లైఫ్ గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాల గురించి ఇప్పుడు చెప్పుకొచ్చింది ఈ ఫిదా బ్యూటీ. అసలెప్పుడు ఎక్కడా చెప్పని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది ఈమె. తన కుటుంబంతో పాటు తన అలవాట్ల గురించి అన్నీ చెప్పింది ఈమె.

సాయి పల్లవి Photo: Instagram.com/saipallavi.senthamarai/
సాయి పల్లవి Photo: Instagram.com/saipallavi.senthamarai/


ఇదిలా ఉంటే జీవితంలో పెళ్లి కూడా చాలా ముఖ్యం.. దీనిపై కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది సాయి పల్లవి. మీకు ఎలాంటి అబ్బాయి కావాలని అడిగితే వరుణ్ తేజ్ లాంటి వాడు కనిపిస్తే వెంటనే ఐ లవ్ యూ చెప్పేస్తానని చెప్పింది. అయితే ఇక్కడే చిన్న లాజిక్ ఉంది. వరుణ్ తేజ్ అంటే హీరో వరుణ్ తేజ్ కాదు.. ఫిదా సినిమాలో ఉన్న వరుణ్ తేజ్. అంటే ఆ సినిమాలో కారెక్టర్ అన్నమాట.. అలాంటి అబ్బాయి నిజంగా కనిపిస్తే వెంటనే ప్రేమలో పడిపోతానని.. ఐ లవ్ యూ చెప్పేస్తానని చెప్పింది ఈమె.

ఫిదా ఫైల్ ఫోటో (Fidaa file photo)
ఫిదా ఫైల్ ఫోటో (Fidaa file photo)


ఫిదా సినిమాలో వరుణ్, సాయి పల్లవి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ ఇద్దరు మాయ చేసారు. ఆ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. అందులో వరుణ్ తేజ్ కారెక్టర్ కూడా చాలా లవబుల్‌గా ఉంటుంది. ప్రతీ అమ్మాయి అలాంటి వాడే కావాలని కోరుకునే పాత్ర అది. అందుకే నిజంగా కూడా తనకు అలాంటి అబ్బాయి తగిలితే వెంటనే ప్రేమలో పడిపోతానని చెప్పింది సాయి పల్లవి. మరి ఫిదాలోని వరుణ్ తేజ్ లాంటి అబ్బాయి ఈమె ముందుకు వస్తాడో లేదో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Sai Pallavi, Telugu Cinema, Tollywood, Varun Tej

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు